Virat Kohli - Rohit Sharma: దాదాపు 14 నెలల విరామం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ సందర్భంగా విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మలు టీ20 జట్టులోకి వచ్చారు. అయితే, వరుస రెండో మ్యాచ్ లలో రోహిత్ శర్మ డకౌట్ అయినప్పటికీ.. కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు. రెండో టీ2ంతో రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ చిన్న ఇన్నింగ్స్ అయినా సూపర్బ్ షాట్స్ ఆడాడు.
Indian National Cricket Team: టీ20 వరల్డ్ కప్ 2024కు ఐసీసీ సర్వం సిద్ధం చేస్తోంది. మెగా టోర్నీకి వెస్టిండీస్, యూఎస్ఏలు వేదికలు కానుండగా, ఇప్పటికే ఐసీసీ షెడ్యూల్ ను ప్రకటించింది. ఇక చాలా కాలం తర్వాత భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ తో టీ20లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ప్రపంచ కప్ భారత జట్టులో చోటుదక్కించుకోడం ఖాయంగానే కనిపిస్తోంది. అలాగే, ఈ జోడీతో భారత్ ఓపెనింగ్ కు దిగనుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వరల్డ్ కప్ జరగబోయే వెస్టిండీస్, యూఎస్ఏలోని పిచ్‌లు పవర్‌ప్లే తొలి ఆరు ఓవర్లలో భారీ స్కోర్ చేయడానికి అనుకూలంగా ఉంటాయనీ, టీ20 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీల సీనియర్ ద్వయం ఓపెనింగ్ చేయాలని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.
ఇద్దరు దిగ్గజ ప్లేయర్ల గురించి ఆకాశ్ చోప్రా మరింతగా మాట్లాడుతూ.. కోహ్లీ సాధారణంగా స్లో స్టార్టర్‌గా ఉంటాడనీ, బౌండరీలు కొట్టడానికి సమయం తీసుకుంటాడనీ, అయితే పవర్‌ప్లేలో ఫీల్డింగ్ పరిమితులు అతనికి ప్రారంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడటానికి సహాయపడతాయని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ లో మెరుగైన ఆటతీరుతో రాణిస్తాడనీ, టీ20ల్లో కూడా తొలి బంతికే ఫోర్లు, సిక్సర్లు బాదడం చాలా అరుదు కానీ, పవర్ ప్లేలో 150 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసే అవకాశముందని తెలిపాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ కెరీర్ గురించి ప్రస్తావిస్తూ.. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్‌గా ఆడుతున్న కోహ్లీ గత కొన్నేళ్లుగా మంచి ఫలితాలు సాధించాడు. ఇండియాకు ఓపెనర్ గా ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో 57.14 సగటు, 161.29 స్ట్రైక్ రేటుతో 400 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు మూడు అర్థసెంచరీలు కూడా ఉన్నాయని చెప్పాడు.
India vs Afghanistan: మళ్లీ నిరాశపరిచిన రోహిత్ శర్మ.. ఇలా అయితే కష్టమే.. !
'న్యూయార్క్ లేదా వెస్టిండీస్‌లో పిచ్‌లు మొదటి ఆరు ఓవర్లలో ఎక్కువ పరుగులు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఓపెనర్లుగా అనుకుంటే ఇప్పటినుంచే దానిని అమలు చేయాలని చోప్రా తెలిపాడు. కోహ్లి నం. 3లో బ్యాటింగ్ చేస్తే అది సూర్యకుమార్ యాదవ్‌ను 4వ స్థానానికి నెట్టివేస్తుందనీ, ఇది అతనిపై ప్రభావం చూపెడుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే, 'మీరు యశస్వి జైస్వాల్ లేదా శుభ్‌మన్ గిల్‌ను ఉంచడం గురించి మాట్లాడుతున్నారు. మీరు నం. 3లో గిల్‌ని ఆడాలనుకున్నారు. యశస్వి అక్కడ లేనందున అతను చివరి మ్యాచ్‌లో ఓపెనింగ్ చేశాడు, కానీ అది మీ దీర్ఘకాలిక ప్రణాళిక కాదు లేదా మీరు దాని గురించి ఏమీ ఆలోచించలేదు. రోహిత్‌తో కలిసి యశస్వి మీ మొదటి ఓపెనర్ అనీ, గిల్ కాదని మీరు ఇప్పటికే చెప్పారు' అని చోప్రా ఎత్తి చూపాడు.
Yuvraj Singh: టీమిండియా మెంటార్‌గా యువరాజ్ సింగ్.. !
యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ స్థానంలో ఉంటే సమస్య కేవలం 3వ స్థానంలో ఉన్న కోహ్లీ మాత్రమే కాదు. సూర్యకుమార్ యాదవ్‌ను నంబర్ 4 వద్ద ఉంచడం కూడా ఆటపై ప్రభావం చూపవచ్చునని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ను నెంబర్ 3లో ఉంచాలని వాదించాడు. అయితే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో T20 మ్యాచ్ లో 34 బంతుల్లో అద్భుతమైన 68 పరుగులతో అదరగొట్టి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో భారత్‌ను కైవసం చేసుకోవడంలో కీలకంగా ఉన్న జైస్వాల్‌ను ఓపెనింగ్ స్లాట్ నుండి తొలగించడం కష్టమనే చెప్పాలి. ఇక 14 నెలల విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి కోహ్లి పునరాగమనం చేయడంతో కష్టాల్లో ఉన్న శుభ్‌మన్ గిల్ ఎంట్రీకి కష్టతరం చేస్తోంది. ఇక రోహిత్ శర్మ వరుసగా రెండు డకౌట్‌లతో వెనుదిరిగాడు. అతను ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో రనౌట్ అయ్యాడు.ఇండోర్‌లో భారీ షాడ్ ఆడబోయే డకౌట్ గా వెనుదిరిగాడు. కానీ, రెండు మ్యాచ్ లలో సారథిగా జట్టును గెలుపుదిశగా నడిపించాడు.
వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గెలుపే ముఖ్యం.. అక్షర్ పటేల్ కామెంట్స్ వైరల్