Axar Patel: ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జనవరి 14న జరిగిన మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ ను చిత్తుచేసి 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. నాలుగు ఓవర్లలో 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసిన స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. తన రికార్డుల కంటే టీమ్ గెలుపే ముఖ్యమని అక్షర్ పటేల్ అన్నాడు.
Axar Patel comments on taking 200 wickets: అఫ్గానిస్థాన్ తో జరిగిన రెండో టీ20లో అద్భుత ప్రదర్శన చేసిన అక్షర్ పటేల్ కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లలో 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్ 200 వికెట్లు తీసుకునే రికార్డు సృష్టించాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తర్వాత పొట్టి ఫార్మాట్ లో 200 వికెట్లు, 2000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా అక్షర్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డుల గురించి మాట్లాడుతూ.. 'నాకు వ్యక్తిగత రికార్డు కంటే జట్టు విజయం ముఖ్యం' అని అక్షర్ పటేల్ అన్నాడు.
ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జనవరి 14న జరిగిన మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ ను చిత్తుచేసి 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. అక్షర్ పటేల్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. గుల్బదిన్ నైబ్ (57) హాఫ్ సెంచరీతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 172 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో శివమ్ దూబే (63*), యశస్వి జైస్వాల్ (68) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 173 పరుగులు టార్గెట్ ను ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసింది. మూడు మ్యాచ్ ల సిరీస్ ను రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 అధిక్యంతో కైవసం చేసుకుంది.
India vs Afghanistan: మళ్లీ నిరాశపరిచిన రోహిత్ శర్మ.. ఇలా అయితే కష్టమే.. !
యువ ఆటగాళ్లు శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ అఫ్గానిస్థాన్ ప్రమాదకర బ్యాట్స్ మెన్ ఇబ్రహీం జర్దాన్, గుల్బదిన్ నైబ్ వికెట్లను పడగొట్టిన అక్షర్ పటేల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతర్జాతీయ క్రికెట్ లో 200 వికెట్లు, 2 వేలకు పైగా పరుగులు చేయడంపై స్పందించిన అక్షర్ పటేల్.. 200 టీ20 వికెట్లు తీసినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. 'ఇది చాలా మంచి అనుభవం. టీ20 క్రికెట్లో 200 వికెట్లు తీశానంటే నమ్మలేకపోతున్నా. కానీ భారత జట్టు విజయానికి నేను బాగా దోహదపడాలనుకుంటున్నాను. కొన్నేళ్ల క్రితం నేను ఎన్ని వికెట్లు తీస్తానో నాకు తెలియదు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గెలుపే ముఖ్యం' అని అక్షర్ పటేల్ తెలిపాడు.
అలాగే, ఇంతకుముందుతో పోలిస్తే తన బౌలింగ్ శైలిని మరింత మెరుగ్గా మార్చుకున్నానని తెలిపాడు. గాయం కారణంగా స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ కు దూరమైన అక్షర్ పటేల్ దక్షిణాఫ్రికా సిరీస్ కు కూడా దూరమయ్యాడు. అఫ్గానిస్తాన్ తో జరిగిన టీ20 సిరీస్ ఎంట్రీతో బాల్ తో అదరగొడుతున్నాడు. తొలి రెండు మ్యాచుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. 'బంతిని నెమ్మదిగా విసిరేయాలనుకున్నా. కానీ ఇప్పుడు మంచి లెంగ్త్ తో బౌలింగ్ చేస్తూ నా బౌలింగ్లో చాలా మార్పులు చేశాను. మ్యాచ్ లో ఏ స్పెల్ లోనైనా బౌలింగ్ చేయగలననే నమ్మకం నాకుంది. పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలను. టీ20 క్రికెట్ లో ఒక బౌలర్ ను ముందుగా మానసికంగా సిద్ధం చేయాలి. నేటి మ్యాచ్ తో సిక్సర్ కొడితే ఏదో ఒక రోజు అదే బంతికి వికెట్ తీయాలనే పట్టుదలతో ఉండాలి. గతంలో బ్యాట్స్ మెన్ నా బంతిని కొడుతూ ఉంటే నా ప్రణాళికలు మార్చుకునేవాడినని' తెలిపారు.
Yuvraj Singh: టీమిండియా మెంటార్‌గా యువరాజ్ సింగ్.. !