Shaun Marsh: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ షాన్ మార్ష్ 23 ఏళ్ల పాటు కొనసాగిన తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పారు. ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మార్ష్.. బుధవారం బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్‌తో జరిగే మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మ్యాచ్ చివరిదని తెలిపారు.
Shaun Marsh Retirement: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ షాన్ మార్ష్ 23 ఏళ్ల పాటు కొనసాగిన తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పారు. ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసీస్ మాజీ సారథి ఆరోన్ ఫించ్ రిటైర్మెట్ ప్రకటించిన తర్వాత షాన్ మార్ష్ కూడా ప్రొఫెషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 40 ఏళ్ల మార్ష్ బిగ్ బాష్ లీగ్ లో తన చివరి మ్యాచ్ ఆడనున్నాడు. మెల్బోర్న్ రెనిగేడ్స్ స్టార్ ప్లేయర్ మార్ష్ బీబీఎల్ 2023-24లో తన చివరి మ్యాచ్ ను మెల్బోర్న్ రెనిగేడ్స్ వర్సెస్ సిడ్నీ థండర్ తో ఆడనున్నాడు. మార్ష్ 2019-2020లో రెనిగేడ్స్ జట్టులో చేరాడు. అంతకు ముందు అతను పెర్త్ స్కార్చర్స్ జట్టులో భాగంగా ఉన్నాడు.
సిడ్నీ థండర్ తో ఈ వారంలో జరిగే మ్యాచ్ తన కెరీర్ లో చివరి ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్ అని మార్ష్ ఆదివారం స్పష్టంచేశాడు. రెనిగేడ్స్ జట్టుకు ఆడటం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన మార్ష్.. గత ఐదేళ్లలో నేను కొంతమంది గొప్ప వ్యక్తులను కలిశాననీ, ఈ సమయంలో ఏర్పరచుకున్న స్నేహాలు జీవితాంతం ఉంటాయని తెలిపాడు. అలాగే, ఈ జట్టు చాలా ప్రత్యేకమనీ, అద్భుతమైన సహచరులు, మంచి స్నేహితులను ఇచ్చిందని తెలిపాడు. బిగ్ బాష్ లీగ్ లో గాయం కారణంగా ఆలస్యంగా లీట్ లో చేరిన మార్ష్. ఈ ఏడాది మంచి ఫామ్ లో ఉన్నాడు. 138.16 స్ట్రైక్ రేట్ తో 181 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 45.25. ఈ సీజన్ లో రెనిగేడ్స్ తరఫున కేవలం ఐదు మ్యాచ్లు మాత్రమే ఆడి మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు.
undefined
YUVRAJ SINGH: టీమిండియా మెంటార్‌గా యువరాజ్ సింగ్.. !
మార్ష్ 2001 ప్రారంభంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున షెఫీల్డ్ షీల్డ్ అరంగేట్రం చేశాడు.గత సీజన్ లో దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ బీబీఎల్ చరిత్రలో 40.72 సగటుతో 2810 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. ఇందులో అతను 27 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మార్ష్ ఆస్ట్రేలియా తరఫున 38 టెస్టులు, 73 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. టెస్టులలో 2265 పరుగులు, వన్డేలలో 2773 పరుగులు, టీ20ల్లో 255 పరుగులు చేశాడు. అలాగే, 13 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు కొట్టాడు.
అలాగే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభ ఎడిషన్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా మారిన తర్వాత మార్ష్ వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్ మొట్టమొదటి ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్న ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. 2008 ఎడిషన్‌లో కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్)కు ప్రాతినిధ్యం వహించాడు.
India vs Afghanistan: మళ్లీ నిరాశపరిచిన రోహిత్ శర్మ.. ఇలా అయితే కష్టమే.. !