తగ్గేదేలే.. గ్రౌండ్ లో రెచ్చ‌గొట్టిన బంగ్లాదేశ్.. గెలుపుతో గుణ‌పాఠం చెప్పిన భార‌త్

By Mahesh RajamoniFirst Published Jan 21, 2024, 9:14 AM IST
Highlights

India U19 vs Bangladesh U19: అండర్-19 వరల్డ్ కప్ 2024 ను భార‌త్ గెలుపుతో ప్రారంభించింది. భార‌త్ త‌న తొలి మ్యాచ్ లో 84 ప‌రుగుల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. అయితే, మ్యాచ్ సంద‌ర్భంగా ఇరు జ‌ట్ల ఆగ‌టాళ్ల మ‌ధ్య గొడ‌వ‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. 
 

ND vs BAN U-19 World Cup 2024: అండర్-19 ప్రపంచ కప్‌ను భారత్ అద్భుతంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 84 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. బంగ్లా ప్లేయ‌ర్లు మ‌న ఆట‌గాళ్ల‌తో గొడ‌వ‌ప‌డ్డారు. మ‌నొళ్ల‌ను రెచ్చ‌గొట్ట‌డంతో చిత్తుగా ఓడించి బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ కు తగిన గుణ‌పాఠం చెప్పారు. గ్రౌండ్ లో భార‌త్-బంగ్లాదేశ్ ప్లేయ‌ర్స్ మ‌ధ్య తీవ్ర వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

అండర్-19 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై భారత్ 84 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్లూంఫోంటెయిన్ లోని మంగౌంగ్ ఓవల్ వేదికగా జ‌రిగిన ఈ మ్యాచ్ గెలుపుతో భార‌త్ గ్రూప్-ఏ లో టాప్ లో కొన‌సాగుతోంది. ముందుగా టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ మహ్ఫుజుర్ రెహమాన్ రబీ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన భార‌త్.. ఉదయ్ సహరన్ (64 పరుగులు), ఆదర్శ్ సింగ్ (76 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించ‌డంతో నిర్ణీత 50 ఓవర్లలో 251 పరుగులు చేసింది. అనంతరం బంగ్లా 45.5 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ సందర్భంగా ఉదయ్ సహారన్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య ఘర్షణ జరగగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు ఎవరో తెలుసా?

భారత్ బ్యాటింగ్ సమయంలో తీవ్ర వాగ్వాదం 

ఈ మ్యాచ్ బ్యాటింగ్ లో భారత్ కు శుభారంభం ల‌భించ‌లేదు. 31 పరుగుల వద్ద ఇద్దరు బ్యాట్స్ మెన్ పెవిలియన్ చేరారు. ఆ తర్వాత కెప్టెన్ ఉదయ్ సహారన్, ఆదర్శ్ సింగ్ల అద్భుత సెంచరీ భాగస్వామ్యం భారత్ ను గౌరవప్రదమైన స్కోరుకు చేసేలా ముందుకు న‌డిపింది. ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్ అద్భుత బ్యాటింగ్ తో బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌కు ద‌డ‌పుట్ట‌లించారు. అయితే, బంగ్లా  ఆటగాళ్లు ఇది జీర్ణించుకోలేక ఇన్నింగ్స్ 25వ ఓవర్ లో ఉదయ్ సహారన్ కు అరిఫుల్ ఇస్లాం ఏదో చెప్పడం ప్రారంభించాడు. ఆ తర్వాత బంగ్లా కెప్టెన్ మహ్ఫజుర్ రెహ్మాన్ రబీ కూడా ఇస్లాంతో సహారన్ వైపు వెళ్లి ఏదో చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు భారత కెప్టెన్  స‌హ‌రాన్ వెన‌క్కి త‌గ్గ‌కుండా బంగ్లా ప్లేయ‌ర్ల వైపు క‌దిలాడు. ఇంతలో అక్కడే ఉన్న అంపైర్ జోక్యం చేసుకుని ఆటగాళ్లను వేరు చేశాడు. అనంతరం అంపైర్ బంగ్లా ఆటగాళ్లతో మాట్లాడ‌టం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది.

 

Ones Again India vs Bangladesh Fighting In Match. pic.twitter.com/94E7OxVWy7

— The Mahafuzur Homeopathy (@themahafuzhomeo)

 

భార‌త్ విజయంలో ఉదయ్-ఆదర్శ్ కీలక పాత్ర.. 

ఈ మ్యాచ్ లో కెప్టెన్ సహారన్, ఆదర్శ్ సింగ్ లు అద్భుత ఇన్నింగ్స్ తో భారత్ ను ముందుకు న‌డిపారు. వీరిద్దరి మధ్య మూడో వికెట్ కు 116 పరుగుల భారీ భాగస్వామ్యం నెల‌కోల్పారు. ఆదర్శ్ 96 బంతులు ఎదుర్కొని 76 పరుగులు చేశాడు. ఆదర్శ్ తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు బాదాడు. అదే సమయంలో కెప్టెన్ ఉదయ్ సహారన్ 94 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో ఉదయ్ బ్యాట్ నుంచి నాలుగు ఫోర్లు వచ్చాయి.

తొల‌గించ‌డం స‌రైందే.. ఇషాన్ కిషన్ పై సునీల్ గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్.. !

సౌమ్య పాండే అద్భుత బౌలింగ్

251 పరుగులు చేసిన తర్వాత సౌమ్య పాండే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 9.5 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అష్ఫికర్ రెహ్మాన్ (14 పరుగులు)ను సౌమ్య ఔట్ చేశాడు. ఆ తర్వాత క్లీన్ బౌలింగ్ తో చౌదరి రిజ్వాన్ ను పెవిలియన్ కు పంపాడు. ఇక్బాల్ హుస్సేన్ రూపంలో సౌమ్యకు మూడో వికెట్ దక్కింది. చివ‌ర‌లో మరూఫ్ మృధాను ఔట్ చేసి నాల్గో వికెట్ తీశాడు.

మ‌రూఫ్ మృధా సూప‌ర్ బౌలింగ్..

బంగ్లా బౌలర్ మరుఫ్ మృధా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో అత‌ను ఐదు వికెట్లు తీసుకున్నాడు. 8 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. బంగ్లా తరఫున ఈ మ్యాచ్ లో అత్యంత విజయవంతమైన స్పిన్నర్ గా నిలిచాడు. అదే సమయంలో రిజ్వాన్, మహ్ఫజుర్ డౌవుల్లా బోర్సెన్ లు త‌లా ఒక వికెట్ తీసుకున్నారు.

IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ టెస్టు టిక్కెట్ల ధ‌ర‌లు రూ.200 నుంచే.. వీరికి ఉచితంగానే.. !

click me!