2024 Under-19 Cricket World Cup: అండర్-19 ప్రపంచకప్ ట్రోఫీ లో భారత్ బోణీ కొట్టింది. బంగ్లాతో జరిగిన తొలి మ్యాచ్ లో కెప్టెన్ ఉదయ్ సహరన్ (64 పరుగులు), ఓపెనర్ బ్యాట్స్ మన్ ఆదర్శ్ సింగ్ (76 పరుగులు) హాఫ్ సెంచరీలు సాధించారు. టీమిండియా 84 పరుగుల తేడాతో విజయం సాధించింది.
India U19 vs Bangladesh U19: టీమిండయా బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. అండర్-19 వరల్డ్ కప్ గ్రూప్-ఏ లో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. భారత్ తన తొలి మ్యాచ్ విజయంతో మెగా టోర్నీని ప్రారంభించింది. 84 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత కెప్టెన్ ఉదయ్ సహరన్ (64 పరుగులు), ఆదర్శ్ సింగ్ (76 పరుగులు) హాఫ్ సెంచరీలు చేయడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. భారత్ అద్భుత బౌలింగ్ చేయడంతో బంగ్లా 45.5 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 84 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఉదయ్ సహరాన్-ఆదర్శ్ సింగ్ అద్భుత బ్యాటింగ్
టాస్ ఓడిన తొలుత బ్యాటింగ్ చేసింది. భారత జట్టు ఎడమచేతి వాటం ఓపెనర్ ఆదర్శ్ సింగ్, కెప్టెన్ ఉదయ్ సహారన్ హాఫ్ సెంచరీల సాయంతో బంగ్లాదేశ్ పై ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ మరూఫ్ మృధ 43 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఓవర్లు, స్లాగ్ ఓవర్లలో భారత్ కు పెద్దగా పరుగులు చేయలేకపోయింది. కాగా, భారత జట్టు ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయడం గ్రౌండ్ లో మూడో అత్యధిక స్కోరు. ఆదర్శ్ (96 బంతుల్లో 76 పరుగులు), కెప్టెన్ ఉదయ్ (94 బంతుల్లో 64 పరుగులు) భారత ఇన్నింగ్స్ కు పునాది వేశారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 23.5 ఓవర్లలో 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు ఎవరో తెలుసా?
మరూఫ్ మృధా సూపర్ బౌలింగ్..
బంగ్లా బౌలర్ మరుఫ్ మృధా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో అతను ఐదు వికెట్లు తీసుకున్నాడు. 8 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. బంగ్లా తరఫున ఈ మ్యాచ్ లో అత్యంత విజయవంతమైన స్పిన్నర్ గా నిలిచాడు. అదే సమయంలో రిజ్వాన్, మహ్ఫజుర్ డౌవుల్లా బోర్సెన్ లు తలా ఒక వికెట్ తీసుకున్నారు.
బౌలింగ్లో మెరిసిన సౌమీ పాండే, ముషీర్ ఖాన్
భారత బౌలర్ సౌమీ పాండే ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. 9.5 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో ముషీర్ ఖాన్ 10 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ప్రియాన్షు మోలియా, రాజ్ లింబానీ, అర్షిన్ కులకర్ణిలు తలా ఒక వికెట్ తీసుకున్నారు.
IND VS ENG: భారత్-ఇంగ్లాండ్ టెస్టు టిక్కెట్ల ధరలు రూ.200 నుంచే.. వీరికి ఉచితంగానే.. !