
Team India T20 World Cup Celebrations : టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ గెలిచిన భారత జట్టు గురువారం ఉదయం స్వదేశానికి తిరిగి వచ్చింది. భారత ఛాంపియన్ ప్లేయర్లకు ఢిల్లీలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. బ్యాండ్ డ్రమ్ములతో హోరెత్తించారు. అభిమానుల ఉత్సాహానికి తోడుగా టీమిండియా ప్లేయర్లు కూడా స్టెప్పులేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు డ్యాన్స్ అదరగొట్టారు. ఢిల్లీలో ప్రదాని మోడీతో భేటీ తర్వాత ఇప్పుడు ముంబైలో విజయ పరేడ్ లో టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024 విజయ సంబరాలు చేసుకుంటోంది.
ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో క్రికెట్ జాతర షురూ అయింది. భారత ఛాంపియన్ జట్టు రాక కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు సందడి చేస్తున్నారు. గతంలో ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు ఓపెన్ బస్ రోడ్ షో చేయడంతో మరోసారి ఇప్పుడు మళ్లీ అదే తరహా వాతావరణంతో 2007 టీ20 ప్రపంచకప్ జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. 17 ఏళ్ల తర్వాత మరోసారి అద్భుతమైన క్షణాలు ముంబైలో కనిపిస్తున్నాయి. ఓపెన్ బస్ పరేడ్ షో తో పాటు వాంఖడే లో టీమిండియా విజయ సంబరాలు జరుగుతున్నాయి. స్టేడియంలోకి అందరికి ఉచిత ఎంట్రీ ఉంది. ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్న అభిమానులు లెక్కచేయకుండా టీమిండియా విజయయాత్రలో పాలుపంచుకుంటున్నారు.
ఢిల్లీలో టీ20 ప్రపంచ కప్ ట్రోఫీతో రోహిత్ శర్మ డాన్సు.. వీడియో ఇదిగో
అలాగే, టీమ్ ఇండియా విజయోత్సవ ర్యాలీని అభిమానులు లైవ్ లో కూడా పూర్తి ఉచితంగా చూడవచ్చు. ఈ విషయాన్ని టీమిండియా భారత రాకకు ముందే స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. విజయోత్సవ రోడ్ షోను అభిమానులు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్, యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్షంగా చూడవచ్చు. అంతే కాకుండా వాంఖడేలో జరగనున్న కార్యక్రమానికి అభిమానులకు ఎలాంటి చార్జీలు పెట్టలేదు. రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచకప్‌లో టీమిండియా అజేయంగా వరుసగా 8 మ్యాచ్ లను గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే సాగుతున్న టీమిండియా ఓపెన్ బస్ పరేడ్ లో రోహిత్-రోహిత్.. కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలతో హోరెత్తింది.
టీమిండియా ప్రత్యేక జెర్సీతో ప్రధాని మోడీ..