Tanmay Agarwal records: దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ రంజీలో హైదరాబాద్ క్రికెటర్ తన్మయ్ అగర్వాల్ రవిశాస్త్రి రికార్డును బ్రేక్ చేశాడు. అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీని నమోదుచేశాడు. అలాగే, కేవలం 147 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన తొలి క్రికెటర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
Tanmay Agarwal-Ravi Shastri: హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీని నమోదు చేశాడు. అగర్వాల్ హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 615/4డి భారీ స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషంచాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని నెక్స్‌జెన్ క్రికెట్ గ్రౌండ్‌లో కేవలం 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అగర్వాల్ తన ఇన్నింగ్స్ లో 181 బంతుల్లో 366 పరుగులు చేసి నబమ్ టెంపోల్ చేతిలో అవుట్ అయ్యాడు. అగర్వాల్ చేసిన 366 రంజీ ట్రోఫీ చరిత్రలో ఉమ్మడి నాలుగో అత్యధిక స్కోరు. దేశవాళీ గేమ్‌లో మొదటి రోజు ట్రిపుల్ సెంచరీ కొట్టిన ప్లేయర్ చరిత్ర సృష్టించాడు.
దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ రంజీలో హైదరాబాద్ క్రికెటర్ తన్మయ్ అగర్వాల్ రవిశాస్త్రి రికార్డును బ్రేక్ చేశాడు. అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీని నమోదుచేశాడు. 39 ఏండ్ల క్రితం టీమిండియా దిగ్గజ ప్లేయర్ రవిశాస్త్రి దేశవాళీ క్రికెట్ లో 123 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టాడు. ఇప్పుడు తన్మయ్ అగర్వాల్ ఆ రికార్డును బ్రేక్ చేస్తూ కేవలం 119 బంతుల్లోనే డబుల్ సెంచరీ కొట్టాడు. అతని ఇన్నింగ్స్ లో ఏకంగా 34 బౌండరీలు, 26 సిక్సర్లు ఉన్నాయి.
undefined
YASHASVI JAISWAL: ఫార్మట్ ఏదైనా దంచికొట్టుడే.. టీమిండియాకు మరో సెహ్వాగ్.. !
డబుల్ సెంచరీ చేసిన తర్వాత బౌలర్లపై మరింతగా విరుచుకుపడుతూ ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. కేవలం 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ కొట్టిన ప్లేయర్ గా చరిత్ర సృష్టంచాడు. ఈ ఇన్నింగ్స్ రంజీలో టాప్-5 వ్యక్తిగత స్కోర్లలో ఒకటిగా నిలిచింది. 1948లో మహారాష్ట్రపై ఆడుతున్నప్పుడు 443* కొట్టిన భౌసాహెబ్ నింబాల్కర్ - ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన రికార్డును సృష్టించాడు. ఆ తర్వాత ముంబైకి చెందిన ఇద్దరు బ్యాటర్లు పృథ్వీ షా 2023లో 397 పరుగులు, సంజయ్ మంజ్రేకర్ 1991లో 377 పరుగులు చేశారు. అలాగే, 1993/94 సీజన్‌లో 366 పరుగులు చేసిన ఎంవీ శ్రీధర్‌తో తన్మయ్ తన రికార్డును సమంగా పంచుకున్నాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్రియాన్ లారా 1994లో వార్విక్‌షైర్‌కు ఆడుతూ 501* పరుగులు చేశాడు. రెండో స్థానంలో కరాచీ తరఫున 1959 ఆడుతున్నప్పుడు 499 పరుగులు చేసిన పాకిస్థాన్ లెజెండ్ హనీఫ్ మొహమ్మద్ రెండో స్థానంలో ఉన్నాడు.
చెత్త షాట్.. పదేపదే అదే తప్పు.. శుభ్‌మన్ గిల్ పై సునీల్ గవాస్కర్ హాట్ కామెంట్స్.. !