IND v ENG: భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 190 పరుగుల అధిక్యం లభించింది. భారత ప్లేయర్లలో యశస్వి జైస్వాల్ 80 పరుగులు, కేఎల్ రాహుల్ 86 పరుగులు, రవీంద్ర జడేజా 87, శ్రీఖర్ భరత్ 41 పరుగులు, అక్షర్ పటేల్ 44 పరుగులతో బ్యాట్ తో రాణించారు.
India vs England - Bazball Jaisball: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా ప్రారంభం అయింది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌట్ అయింది. బెన్ స్టోక్స్ మాత్రమే బ్యాట్ తో రాణించి 88 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 64.1 ఓవర్లు ఆడి 246 పరుగులకు ఆలౌట్ అయింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు.
భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 436 పరుగులకు ఆలౌట్ అయింది. జైస్వాల్ 80 పరుగులు, కేఎల్ రాహుల్ 86 పరుగులు, రవీంద్ర జడేజా 87, శ్రీఖర్ భరత్ 41 పరుగులు, అక్షర్ పటేల్ 44 పరుగులు చేశారు. భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగులు అధిక్యం లభించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో రూట్ 4 వికెట్లు, రెహాన్ అహ్మద్ 2, టామ్ హార్ట్లీ 2, జాక్ లీచ్ ఒక వికెట్ తీసుకున్నారు. ఇక ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించగా, ఓపెనర్ జాక్ క్రాలీని అశ్విన్ ఔట్ చేశాడు. బెన్ డకెట్, ఒల్లీ పోప్ లు క్రీజులో ఉన్నారు.
చెత్త షాట్.. పదేపదే అదే తప్పు.. శుభ్‌మన్ గిల్ పై సునీల్ గవాస్కర్ హాట్ కామెంట్స్.. !
భారత్ తొలి ఇన్నింగ్స్ వికెట్ల పతనం:
80-1 ( రోహిత్ , 12.2), 123-2 ( యశస్వి జైస్వాల్ , 23.4), 159-3 ( గిల్ , 34.5), 223-4 ( శ్రేయస్ అయ్యర్ , 52.3), 288-5 ( రాహుల్ , 364 ). 6 ( శ్రీకర్ భారత్ , 88.2), 358-7 ( అశ్విన్ , 90.3), 436-8 ( రవీంద్ర జడేజా , 119.3), 436-9 ( బుమ్రా , 119.4), 436-10 ( అక్సర్ , 120.6)
Innings Break! post 436 on the board, securing a 1⃣9⃣0⃣-run lead.
8⃣7⃣ for
8⃣6⃣ for
8⃣0⃣ for
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E | pic.twitter.com/cVzCnmMF5h
సౌరవ్ గంగూలీని బీట్ చేసిన రోహిత్ శర్మ.. !