t20 worldcup 2021: టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ... ఇంగ్లాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లో...

Published : Oct 18, 2021, 07:10 PM ISTUpdated : Oct 18, 2021, 07:36 PM IST
t20 worldcup 2021: టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ... ఇంగ్లాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లో...

సారాంశం

T20 Worldcup 2021 INDvsENG Warm-up Match: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ... ఇయాన్ మోర్గాన్‌కి విశ్రాంతి, కెప్టెన్‌గా జోస్ బట్లర్...

టీ20 వరల్డ్ కప్ 2021  టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత సారథి విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కి విశ్రాంతినివ్వడంతో జోస్ బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

భారత సారథి విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేస్తానని కామెంట్ చేశాడు... ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు ఓపెనర్‌గా వచ్చే ఆలోచన ఉందని చెప్పిన విరాట్, కెఎల్ రాహుల్ ఫామ్ చూసిన తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది.

Must Read: టీ20 వరల్డ్‌కప్ 2021: రద్దు దిశగా భారత్, పాక్ మ్యాచ్‌?... కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్లతో...

భారత జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి ( ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, వరుణ్ చక్రవర్తిలకు విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా నిర్ణయించుకుంది....)

ఇంగ్లాండ్ జట్టు: జోస్ బట్లర్, జాసన్ రాయ్, డేవిడ్ మలాన్, జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్ స్టోన్, మొయిన్ ఆలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, అదిల్ రషీద్, మార్క్ వుడ్

ఇవీ చదవండి: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మోత మోగించిన సిక్సర్ల వీరులు వీరే... యువరాజ్ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ..

ధోనీ కింద పడుకుని, నాకు తన బెడ్ ఇచ్చాడు, మాహీయే నా లైఫ్ కోచ్... - హార్దిక్ పాండ్యా...

PREV
click me!

Recommended Stories

IPL 2026 Orange Cap: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసు.. వైభవ్ రికార్డును గిల్, సుదర్శన్ బ్రేక్ చేస్తారా?
Riyan Parag Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని రియాన్ పరాగ్ తిట్టాడా? వైరల్ వీడియో