
యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World Cup) లో నేటి సాయంత్రం భారత జట్టు (India) ఇంగ్లండ్ (England) ను ఢీకొనబోతుంది. వార్మప్ మ్యాచ్ లో భాగంగా ఇరుజట్లు తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి. ఇదిలాఉండగా ఈ మ్యాచ్ కు ముందు భారత జట్టు ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma), టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed shami) కొత్త జెర్సీలతో మెరిశారు.
సోషల్ మీడియా వేదికగా రోహిత్, షమీ లు తమ జెర్సీ (Team India New Jersey)లను ఫ్యాన్స్ కు పరిచయం చేశారు. రోహిత్ శర్మ ఇందుకు సంబంధించి ఇన్స్టాగ్రామ్ లో వినూత్న రీతిలో వీడియో రూపొందించి పోస్టు చేశాడు. ‘నా కొత్త జెర్సీలోకి వెళ్తున్నాను’ అంటూ అందులో రాసుకొచ్చాడు.
ఇక మహ్మద్ షమీ కూడా ఈ ప్రపంచకప్ లో తాను ధరించబోయే కొత్త జెర్సీని అభిమానులకు పరిచయం చేశాడు.
ఇప్పటికే భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli), ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R.Ashwin) లు ఈ జెర్సీని రివీల్ చేశారు. అశ్విన్ తన కూతురుతో కలిసి ఉన్న ఫోటోను దిగి ట్విట్టర్ లో ఫోటో ను ఉంచాడు.
ఇదిలాఉంటే టీమిండియా జెర్సీపై మాత్రం ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. భారత జట్టుకు కొత్త జెర్సీ ఎప్పుడూ అచ్చిరాలేదనేది బహిరంగ వాస్తవమే. ఇటీవల ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (ICC WTC Final) సందర్భంగా కూడా టీమిండియా కొత్త జెర్సీని ధరించింది. కానీ ఇందులో ఫలితం మనకందరికీ తెలిసిందే.
ఇవి కూడా చదవండి:T20 World Cup: టీమిండియా కొత్త జెర్సీ వచ్చేసింది.. రెట్రో బ్లూ డ్రెస్సులతో అదరగొడుతున్న భారత క్రికెటర్లు
Bandula Warnapura: శ్రీలంక తొలి టెస్టు కెప్టెన్ మృతి.. టీ20 క్వాలిఫయింగ్ మ్యాచ్ కు ముందు భారీ షాక్
న్యూజిలాండ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో భారత్ దారుణంగా విఫలమైంది. ఆ టెస్టులో ఆడిన రోహిత్ శర్మ, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, బుమ్రా పేలవ ప్రదర్శనతో విమర్శల పాలయ్యారు. వీళ్లంతా ఇప్పుడు టీ20 జట్టులో కూడా ఉండటం గమనార్హం. భారత క్రికెట్ అభిమానులు ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆందోళనకు గురవుతున్నారు. మరి టీమిండియా ఈ సాంప్రదాయాన్ని మారుస్తుందో లేక అదే బాటలో పయనిస్తుందో తెలియాలంటే కొద్దికాలం వేచి చూడాలి.