టీ20 వరల్డ్‌కప్ 2021: నెదర్లాండ్స్‌పై ఐర్లాండ్ సునాయాస విజయం... ఏడు వికెట్ల తేడాతో గెలిచి...

By Chinthakindhi RamuFirst Published Oct 18, 2021, 6:50 PM IST
Highlights

నెదర్లాండ్స్ విధించిన 107 పరుగుల లక్ష్యాన్ని 15.1 ఓవర్లలో ఛేదించిన ఐర్లాండ్... టీ20 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్‌కి తొలి విజయం...

టీ20 వరల్డ్ కప్ 2021 క్వాలిఫైయర్స్ రౌండ్‌లో ఐర్లాండ్ అద్భుత విజయాన్ని అందుకుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంభం నుంచి మంచి ఆధిపత్యం కనబరిచి, ఏడు వికెట్ల తేడాతో సునాయాస విజయం అందుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 106 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఐర్లాండ్ బౌలర్ కర్టీస్ కాంపర్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదుచేశాడు...

టీ20ల్లో రషీద్ ఖాన్, లసిత్ మలింగ తర్వాత నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన కర్టీస్... టీ20 వరల్డ్ కప్ టోర్నీలో బ్రెట్‌లీ తర్వాత హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు...

ఓ వైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ మ్యాక్స్ ఓవర్డ్ 51 పరుగులు, కెప్టెన్ సీలార్ 21 పరుగులు చేయడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది నెదర్లాండ్స్... 10వ ఓవర్‌లో నాలుగు వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్, మార్క్ అడిదర్ వేసిన ఆఖరి ఓవర్‌లో చివరి మూడు బంతులకు మూడు వికెట్లు కోల్పోవడం విశేషం...

107 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఐర్లాండ్‌ కెవిన్ ఓ బ్రియాన్ 9, ఆండ్రూ బాల్బీర్నీ 8 వికెట్లు కోల్పోయినా పాల్ స్టిర్లింగ్స్ 30, గరెత్ డెలానీ 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేసి... సునాయాస విజయాన్ని అందించారు. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఐర్లాండ్‌కి ఇదే మొట్టమొదటి విజయం కావడం విశేషం...

click me!