T20 worldcup 2021: నెదర్లాండ్స్‌పై శ్రీలంక ఘన విజయం... టేబుల్ టాపర్‌గా సూపర్ 12కి ఎంట్రీ...

By Chinthakindhi RamuFirst Published Oct 22, 2021, 9:30 PM IST
Highlights

t20 worldcup 2021: 45 పరుగుల లక్ష్యఛేదనలోనూ రెండు వికెట్లు కోల్పోయిన లంక... 17.1 ఓవర్లలో ముగిసిన మ్యాచ్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ  క్వాలిఫైయర్ మ్యాచులు ముగిశాయి. చివరి గ్రూప్ మ్యాచ్‌లో లంక జట్టు, నెదర్లాండ్స్‌ను వికెట్ల తేడాతో చిత్తు చేసింది. నెదర్లాండ్స్‌ విధించిన 45 పరుగుల టార్గెట్ ఛేదనను త్వరగా ముగించాలనే తొందరలో 2 వికెట్లు కోల్పోయింది లంక జట్టు.

నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌కి 10 ఓవర్లలో తెర పడగా, 45 పరుగుల టార్గెట్‌ను 7.1 ఓవర్లలో అందుకుంది లంక. దీంతో 17.1 ఓవర్లలో మ్యాచ్ పూర్తి కావడం విశేషం. ఓపెన్ నిశ్శక ఐదు బంతులాడి డకౌట్ కాగా, 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన చరిత్ అసలంక కూడా ఆరో ఓవర్‌లో అవుట్ అయ్యాడు... 

తొలి వికెట్‌ 7 పరుగుల వద్ద కోల్పోయిన లంక, 31 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అయితే వికెట్ కీపర్ కుశాల్ పెరేరా మాత్రం దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించాడు... పెరేరా 24 బంతుల్లో 6 ఫోర్లతో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
 
టీ20 వరల్డ్‌కప్ 2021 సూపర్ 12 రౌండ్‌కి శ్రీలంక జట్టు, మిగిలిన జట్లకి హెచ్చరికలు పంపింది. లంక బౌలర్ల దూకుడుకి, బ్యాట్స్‌మెన్ తొందరపాటు కూడా తోడుకావడంతో 44 పరుగులకే ఆలౌట్ అయ్యింది నెదర్లాండ్స్‌...

మొదటి ఓవర్ నాలుగో బంతికి మాక్స్ ఓడౌడ్ రనౌట్ కావడంతో మొదలైన నెదర్లాండ్స్ పతనానికి ఏ దశలోనూ బ్రేకులు పడలేదు. బెన్ కూపర్ 8, స్టీఫెన్ మెబ్రూగ్ 5, కోలిన్ అక్రేమన్ 11, పీటర్ సీలార్ 2 పరుగులు, స్కాట్ ఎడ్వర్డ్స్ 8 పరుగులు చేసి అవుట్ కాగా... నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు...

నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో రెండో వికెట్‌కి బెన్ కూపర్, స్టీఫెన్ జోడించిన 17 పరుగులకే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం...శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగ 3 ఓవర్లలో 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా లహీరు కుమార్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి తోకను తుంచాడు, తీక్షణ రెండు వికెట్లు తీయగా ఛమీరా ఓ వికెట్ తీశాడు. 

టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోరు. ఇంతకుముందు శ్రీలంకపైనే 2014 టీ20 వరల్డ్‌కప్‌లో 39 పరుగులకి ఆలౌట్ అయ్యింది నెదర్లాండ్స్. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఓ జట్టు 10 ఓవర్లలోనే ఆలౌట్ కావడం కూడా ఇదే తొలిసారి.

టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఒకే జట్టును రెండుసార్లు 50 పరుగుల లోపు ఆలౌట్ చేసిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది శ్రీలంక.. 

ఇవీ చదవండి: పాకిస్తాన్‌లో కోహ్లీ కంటే అతనికే ఫాలోయింగ్ ఎక్కువ... ఇక్కడ అందరూ ‘ఇండియాకా ఇంజమామ్’ అని...

వెల్‌కం బ్యాక్ ధోనీ... మాహీ రిటైర్మెంట్ తర్వాత మ్యాచులు చూడడం మానేసిన పాకిస్తానీ బషీర్ చాచా...

T20 worldcup 2021: ధోనీని మెంటర్‌గా తీసుకొచ్చింది అతనే... కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని...

 ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు... చితక్కొట్టుడు అంతే ఇదేనేమో... ఆస్ట్రేలియా బ్యాటర్ రికార్డు...

T20 worldcup 2021: మ్యాచ్ అవసరమా, మాకు వాకోవర్ ఇచ్చేయండి... షోయబ్ అక్తర్‌కి హర్భజన్ సింగ్ చురక...

T20 worldcup 2021: అతన్ని తీసుకోవడానికి ధోనీయే కారణం... కోహ్లీ, శాస్త్రిలను ఒప్పించి మరీ...

 T20 worldcup 2021: సన్‌రైజర్స్ జట్టు, వార్నర్‌ను అవమానించింది... ఐపీఎల్ వల్లే అతనిలా ఆడుతున్నాడు...

 T20 worldcup 2021: నాలుగేళ్లు, రూ.36 వేల కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట...

 T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

click me!