హార్ధిక్ పాండ్యా మొదలెట్టేశాడు... న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా శార్దూల్ ఠాకూర్‌కి...

By Chinthakindhi RamuFirst Published Oct 28, 2021, 5:33 PM IST
Highlights

టీ20 వరల్డ్‌కప్ 2021 : ప్రాక్టీస్ సెషన్స్‌లో హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేస్తున్న దృశ్యాలను షేర్ చేసిన హార్ధిక్ పాండ్యా... న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో పాండ్యా బౌలింగ్ చేసే అవకాశం...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టును ఇబ్బంది పెడుతున్న కొరత స్టార్ ఆల్‌రౌండర్. రవీంద్ర జడేజా ఉన్నా అతను వికెట్లు తీయడం మానేసి చాలా రోజులే అవుతోంది. ఐపీఎల్‌లో తప్ప మిగతా మ్యాచుల్లో జడ్డూ బౌలింగ్‌లో వికెట్లు తీసే రేంజ్‌లో అయితే లేదు. హర్ధిక్ పాండ్యా జట్టులో ఉన్నా, అతను బౌలింగ్ చేయడానికి కావాల్సినంత ఫిట్‌గా లేకపోవడం భారత జట్టుకి తలనొప్పులు తెచ్చిపెట్టింది. అయితే న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది...

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 బంతుల్లో రెండు ఫోర్లతో 11 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, బ్యాటింగ్ చేసే సమయంలో గాయపడ్డాడు. హార్ధిక్ పాండ్యా భుజానికి గాయం కావడంతో దాని తీవ్రత తెలుసుకునేందుకు స్కానింగ్‌ కూడా నిర్వహించారు వైద్యులు. అయితే పాండ్యాకి అయిన గాయం పెద్దది కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు...

Latest Videos

Read this: ఇది పొగరు కాదు, అంతకుమించి... మ్యాచ్‌కి ముందు అలా చేయడం ఇష్టం లేక డి కాక్ సంచలన నిర్ణయం...

గాయం నుంచి కోలుకున్న హార్ధిక్ పాండ్యా, ప్రస్తుతం ప్రాక్టీస్ సెషన్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేస్తే, భారత జట్టుకి ఆరో బౌలింగ్ ఆప్షన్ దొరికినట్టే అవుతుంది. భారత ఫిజియో నితిన్ పటేల్, అసిస్టింట్ ట్రైయినర్ సోహమ్ దేశాయ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పర్యవేక్షణలో కొన్ని ఫిట్‌నెస్ డ్రిల్స్ చేశాడు హార్ధిక్ పాండ్యా...

బౌలింగ్ చేసేందుకు హార్ధిక్ పాండ్యా ఫిట్‌గా ఉన్నాడని ఫిజియో నమ్మకం వ్యక్తం చేయడంతో సెట్స్‌లో కాసేపు బౌలింగ్ చేశాడు. అలాగే బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనూ తనదైన మెరుపులు మెరిపంచాడు... 2019 వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడిన హార్ధిక్ పాండ్యా, 2020 ఐపీఎల్‌తో పాటు ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా బౌలింగ్ చేయలేకపోయాడు. ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో బౌలింగ్ చేసినా, ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొన్నాడు. ఎట్టకేలకు పాండ్యా బౌలింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు నిర్ధారించారు ఫిజియోలు...

Read this ALSO: రోహిత్ స్థానంలో విరాట్ కోహ్లీ ఉండి ఉంటే, ఈపాటికి ఎలా... పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై విరాట్ ఫ్యాన్స్... 

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేకపోయిన హార్ధిక్ పాండ్యా, ఇన్నింగ్స్ ఆఖర్లో క్రీజులోకి వచ్చినా బ్యాటింగ్‌లో మెరుపులు చూపించలేకపోయాడు. దీంతో బౌలింగ్ చేయలేకపోతే హార్ధిక్ పాండ్యా బదులుగా శార్దూల్ ఠాకూర్‌ని జట్టులోకి తీసుకోవాలని విమర్శలు వచ్చాయి. బ్యాటింగ్‌లో అవసరమైన మెరుపులు మెరిపించడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీసే శార్దూల్ ఠాకూర్ ఉంటే జట్టుకి అదనపు ప్రయోజనం దక్కుతుందని కామెంట్లు చేశారు మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు...

హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేసేందుకు ఫిట్‌గా ఉంటే న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ని ఆడించే అవకాశం ఉండొచ్చు. లేదా మెంటర్ మహేంద్ర సింగ్ ధోనీ, భువీకి మరో అవకాశం ఇవ్వాలని భావిస్తే... శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చేందుకు మరికొంత కాలం ఆగకతప్పదు..

Read: గెలిస్తే సెమీస్‌కి, ఓడితే ఇంటికి: నాకౌట్‌ మ్యాచ్ గా ఇండియా వర్సెస్ కివీస్, 18 ఏళ్ల తర్వాత..

టీమిండియాతో పాటు న్యూజిలాండ్ కూడా తొలి మ్యాచ్‌లో ఓడడంతో అక్టోబర్ 31 ఆదివారం జరిగే మ్యాచ్ ఇరు జట్లకీ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్ రేసులో ఉంటే, ఓడిన జట్టు రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టే అవుతుంది. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన టీమిండియా, ఆ తర్వాత గత 18 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ ఓడించలేదు. ఈసారి ఓడించక తప్పని పరిస్థితి...

click me!