T20 Worldcup: టీమిండియానా..? ఫైనల్ కా..? అలా అయితే అది గొప్ప విషయమే..! పాక్ కోచ్ సంచలన వ్యాఖ్యలు

By team teluguFirst Published Oct 28, 2021, 5:24 PM IST
Highlights

India vs Pakistan: భారత్ ను అందరూ టైటిల్ ఫేవరేట్ గా భావిస్తున్నారని, కానీ తాము మాత్రం అన్ని జట్లను ఒకే విధంగా చూస్తామని ముస్తాక్ అన్నాడు. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ ను ఓడించిన పాక్.. రేపు ఆఫ్ఘనిస్థాన్ తో తలపడబోతున్నది.

టీ20 ప్రపంచకప్ (T20 Worldcup)లో టీమిండియా (Team India) ఫైనల్ వస్తే అది గొప్ప విషయమే అంటున్నాడు ఆ జట్టు హెడ్ కోచ్ సక్లయిన్ ముస్తాక్ (saqlain Mushtaq). ఈ రెండు జట్లు ఫైనల్ లో తలపడాలని తాను కోరుకుంటున్నానని అన్నాడు. భారత్ ను అందరూ టైటిల్ ఫేవరేట్ గా భావిస్తున్నారని, కానీ తాము మాత్రం అన్ని జట్లను ఒకే విధంగా చూస్తామని చెప్పాడు. ఇప్పటికే భారత్ (India), న్యూజిలాండ్ (Newzealand) ను ఓడించి రేపు ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) తో తలపడబోతున్న పాక్.. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ముస్తాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ముస్తాక్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ భారత్ ఫైనల్ కు చేరుకుంటే అది గొప్ప విషయం. ఫైనల్ లో భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మరోసారి తలపడాలని నేనూ కోరుకుంటున్నాను. ఇదివరకే ఒకసారి మేము వాళ్లను ఓడించామని కాదు గానీ  వారు (టీమిండియా) చాలా బలమైన జట్టుగా ఉన్నారు. అంతేగాక ఈ టోర్నీలో  భారత్ ఫేవరేట్ అని అంతా భావిస్తున్నారు’ అని అన్నాడు. 

ఇండియా-పాకిస్థాన్ రెండు మ్యాచులు ఆడితే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని ముస్తాక ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘గత మ్యాచ్ లో విరాట్ కోహ్లి (Virat Kohli), ఎంఎస్ ధోని (MS Dhoni) తో మా ఆటగాళ్లు ఎంత సాన్నిహిత్యంగా ఉన్నారో మనమంతా చూశాం.  దీని ద్వారా రెండు దేశాల ప్రజలకు ఒక బలమైన సందేశం పంపినట్టైంది. మేమంతా మనుషులం. మేం ఒకరిని ఒకరం ప్రేమించుకుంటాం. ఇది ఒక  ఆట మాత్రమే అనే సందేశం వెళ్లింది. మరో మ్యాచ్ ఆడితే ఆ సంబంధాలు మరింత బలపడుతాయి. స్నేహమే విజయం సాధిస్తుంది. శత్రుత్వం ఎప్పటికైనా ఓడిపోతుంది’ అని చెప్పాడు. ఇలా చేసిన ఆటగాళ్లందరికీ తాను కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నాడు. 

ఇది కూడా చదవండి: T20 Worldcup: ఈ షాట్ ను ఏమంటారో కొంచెం చెప్పండి బాబూ..! మ్యాక్స్వెల్ కిరాక్ క్రికెటింగ్ షాట్ కు నెటిజన్లు ఫిదా

టోర్నీలో భారత్ తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లను కూడా తాము బలమైన జట్లుగానే భావిస్తున్నామని ముస్తాక్ అన్నాడు. కానీ ప్రత్యర్థి ఎంత బలంగా ఉన్నా తమ ఆట తాము ఆడుతామని స్పష్టం చేశాడు. ‘ఒకవేళ మీరు ప్రపంచ ఛాంపియన్ కావాలనుకుంటే మీరు మీ ఆటపై దృష్టి పెట్టాలి. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ కచ్చితంగా ఫేవరేట్ గా ఉంది. అలాగే ఆసీస్, సౌతాఫ్రికా కూడా బలంగా ఉన్నాయి. కానీ నిబద్ధత, కచ్చితమైన వైఖరి, సాధించాలనే పట్టుదల మాత్రమే మనచేతుల్లో ఉంటుంది. ఫలితాలు కాదు’ అని చెప్పుకొచ్చాడు. 

ఇది కూడా చదవండి:T20 Worldcup: పాకిస్థాన్ కోచ్ గా టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన మాజీ కోచ్.. పరిశీలనలో మరో ఇద్దరి పేర్లు..?

ఇక  ప్రత్యర్థి ఎవరైనా మ్యాచ్ కు ముందు తాము అనుకున్న ప్రణాళికలను పక్కాగా అమలుచేయడమే తమ కర్తవ్యమని ముస్తాక్ తెలిపాడు.  

click me!