T20 Worldcup: ఈ షాట్ ను ఏమంటారో కొంచెం చెప్పండి బాబూ..! మ్యాక్స్వెల్ కిరాక్ క్రికెటింగ్ షాట్ కు నెటిజన్లు ఫిదా

By team teluguFirst Published Oct 28, 2021, 4:27 PM IST
Highlights

Australia Vs Srilanka: మీరు అప్పర్ కట్ లు, స్వీప్ షాట్లు, దిల్ స్కూప్ లు చూసుంటారు. కుడి చేతి వాటం బ్యాటర్ ఎడమ చేతికి తిరిగి బాదే సిక్సర్లను చూసుంటారు. కానీ ఈ షాట్ ను మాత్రం మీ జీవితంలో  చూసి ఉండరు. ఈ షాట్ కు ఏం పేరు పెట్టాల్రా దేవుడా..? అంటూ ఏకంగా ఐసీసీనే తలలు పట్టుకుంది.

మీరు అప్పర్ కట్ చూసుంటారు.. స్ట్రేట్ డ్రైవ్ చూసుంటారు.. కీపర్ మీద నుంచి బాదే దిల్ స్కూప్ చూసుంటారు.. ఇవన్నీ కాకుంటే కుడి చేతి వాటం బ్యాటర్ ఎడమ చేతికి తిరిగి బాదే సిక్సర్లను చూసుంటారు. కానీ ఈ షాట్ ను మాత్రం మీ జీవితంలో  చూసి ఉండరు. ఈ షాట్ కు ఏం పేరు పెట్టాల్రా దేవుడా..? అంటూ ఏకంగా ఐసీసీ (ICC) నే తలలు పట్టుకుంది. ఇంతకు ఏంటా షాట్..? అంత కఠినమైన షాట్ కొట్టిన బ్యాటర్ ఎవరు..? అనుకుంటున్నారా..? అయితే ఇది చదవాల్సిందే. 

గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell).. పరిచయం అక్కర్లేని పేరు. ఆస్ట్రేలియా (Australia)కు చెందిన ఈ ధనాధన్ ప్లేయర్ మరో మిస్టర్ 360 (ఈ బిరుదు దక్షిణాఫ్రికా  ఆటగాడు ఏబీ డివిలియర్స్ (AB Devilliers) కు ఉంది) అనడంలో సందేహమే లేదు.  ఎలాంటి బంతినైనా తనదైన శైలిలో ఆడి సిక్సర్ బాదగల అతికొద్ది మంది సమర్థులలో మ్యాక్సీ ఒకడు. కొద్దిరోజుల క్రితం ముగిసిన  ఐపీఎల్ (IPL) లో.. రాయల్ ఛాలెంజర్స్ (Royal Challengers)తరఫున ఆడిన మ్యాక్సీ  బ్యాటింగ్ విన్యాసాలను అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ మ్యాక్సీనే ఇప్పుడు మరో కొత్త షాట్ ను కనిపెట్టాడు. దాని పేరేంటో చెప్పాలని ఐసీసీ అతడిని అభ్యర్థించింది. 

మాములుగా ప్రపంచంలో ఏ బ్యాట్స్మెన్ అయినా లెగ్ సైడ్ వైడ్ వెళ్తున్న బంతిని అయితే వదిలేస్తాడు లేదంటే  షాట్ కు ప్రయత్నిస్తాడు. కానీ  అలా చేస్తే మ్యాక్సీ ది ఏముంది ప్రత్యేకత. లెగ్ సైడ్ వెళ్తున్న బంతిని కాళ్ల వెనుకనుంచి  షాట్ ఆడటానికి ప్రయత్నించాడు మ్యాక్సీ. అది స్వీప్ కూడా కాదు. డైరెక్ట్ గా బాదడమే.. ఇప్పుడు ఇదే వీడియోను ఐసీసీ షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

ఈ షాట్ ను ఏమంటారు..? అని ఐసీసీ వీడియోను షేర్ చేస్తూ రాసుకొచ్చింది. దానికి నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మిస్టర్ 380 అని,  ది అల్టా కట్ అని, మ్యాక్సిమెంకో అని రాస్తున్నారు. ఇక కొంతమందైతే.. వైడ్ బాల్ ను ఎందుకు వేస్ట్ చేశావ్ అని  కామెంట్ చేశారు. 

ఇదిలాఉండగా  ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున అద్భుతంగా ఆడిన మ్యాక్సీ.. టీ20 ప్రపంచకప్ లోనూ అదే ఫామ్ కొనసాగించాలని భావిస్తున్నాడు. అందులో భాగంగానే దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్ లో రాణించాడు. నేటి సాయంత్రం ఆసీస్.. శ్రీలంక (Australia Vs Srilanka)ను ఢీకొనబోతుంది. మరి ఈ మ్యాచ్ లో మ్యాక్స్వెల్..  నెట్స్ లో ప్రాక్టీస్ చేసిన కొత్త షాట్ ను ఆడుతాడో..  లేదో చూడాలంటే కొద్దిసేపు ఓపికపట్టాల్సిందే.

click me!