T20 Worldcup 2021 AUS VS RSA: తేలిపోయిన సఫారీ బ్యాట్స్‌మెన్... ఆసీస్ ముందు ఈజీ టార్గెట్...

By Chinthakindhi RamuFirst Published Oct 23, 2021, 5:12 PM IST
Highlights

T20 Worldcup 2021 AUS VS RSA: రెండో ఓవర్ నుంచే సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌పై ఆసీస్ బౌలర్ల డామినేషన్... నిర్ణీత 20 ఓవర్లలో 118 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగిన సఫారీ జట్టు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ సూపర్ 12 రౌండ్‌లో మొదటి మ్యాచే వన్‌సైడెడ్‌గా సాగేలా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా , నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మిచెల్ స్టార్క్ వేసిన మొదటి ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. అయితే రెండో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన మ్యాక్స్‌వెల్, 7 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన సఫారీ కెప్టెన్ భవుమాని క్లీన్‌బౌల్డ్ చేశాడు...
13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా.

Latest Videos

Must READ: T20 worldcup 2021: టీమిండియాతో మ్యాచ్... 12 మందితో కూడిన జట్టును ప్రకటించిన పాకిస్తాన్...

ఆ తర్వాత మొదటి బంతికే వాన్ డేర్ దుస్సేన్‌ను అవుట్ చేసిన హజల్‌వుడ్, ఆ తర్వాతి ఓవర్‌లో డి కాక్‌ని కూడా బౌల్డ్ చేశాడు..  23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది సఫారీ జట్టు... 13 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన క్లాసెన్, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ కాగా, 18 బంతుల్లో 16 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్‌ను ఆడమ్ జంపా అవుట్ చేశాడు.

మిల్లర్‌ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చిన జంపా, అదే ఓవర్‌లో పెట్రోరియస్‌ను కూడా అవుట్ చేశాడు... ఆ తర్వాత కేశవ్ మహరాజ్ రనౌట్ కావడంతో 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా. ఓ వైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేసిన మార్క్‌రమ్ 36 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

2 పరుగులు చేసిన నోకియా, ఆఖరి ఓవర్‌లో అవుట్ కాగా కగిసో రబాడా 23 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేయడంతో సౌతాఫ్రికా ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజల్‌వుడ్ 4 ఓవర్లలో ఓ వికెట్ మెయిడిన్ ఓవర్‌తో 19 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా ఆడమ్ జంపా ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసి తన నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చాడు..

మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమ్మిన్స్ చెరో వికెట్ పడగొట్టారు. మిచెల్ స్టార్క్‌కి రెండు వికెట్లు దక్కాయి...

ఇవీ చదవండి: 

పాకిస్తాన్‌లో కోహ్లీ కంటే అతనికే ఫాలోయింగ్ ఎక్కువ... ఇక్కడ అందరూ ‘ఇండియాకా ఇంజమామ్’ అని...

వెల్‌కం బ్యాక్ ధోనీ... మాహీ రిటైర్మెంట్ తర్వాత మ్యాచులు చూడడం మానేసిన పాకిస్తానీ బషీర్ చాచా...

T20 worldcup 2021: ధోనీని మెంటర్‌గా తీసుకొచ్చింది అతనే... కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని...

 ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు... చితక్కొట్టుడు అంతే ఇదేనేమో... ఆస్ట్రేలియా బ్యాటర్ రికార్డు...

T20 worldcup 2021: మ్యాచ్ అవసరమా, మాకు వాకోవర్ ఇచ్చేయండి... షోయబ్ అక్తర్‌కి హర్భజన్ సింగ్ చురక...

T20 worldcup 2021: అతన్ని తీసుకోవడానికి ధోనీయే కారణం... కోహ్లీ, శాస్త్రిలను ఒప్పించి మరీ...

 T20 worldcup 2021: సన్‌రైజర్స్ జట్టు, వార్నర్‌ను అవమానించింది... ఐపీఎల్ వల్లే అతనిలా ఆడుతున్నాడు...

 T20 worldcup 2021: నాలుగేళ్లు, రూ.36 వేల కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట...

 T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

 

click me!