సూప‌ర్ డెలివరీ.. అశ్విన్ స్పిన్ దెబ్బకు బిత్త‌ర‌పోయిన బెన్ స్టోక్స్ ! క‌పిల్ దేవ్ రికార్డు స‌మం !

By Mahesh Rajamoni  |  First Published Jan 27, 2024, 4:18 PM IST

Ravichandran Ashwin: ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త స్పిన్న‌ర్లు అద‌ర‌గొడుతున్నారు. ఇదే క్రమంలో ర‌విచంద్ర‌న్ అశ్విన్ సూప‌ర్ డెలివ‌రీతో ఇంగ్లీష్ జ‌ట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ను బొల్తా కొట్టించాడు. కేవ‌లం 6 ప‌రుగులు మాత్ర‌మే చేసి అశ్విన్ బౌలింగ్ లో బౌల్డ్ తో 12వ సారి ఔట్ అయ్యాడు.


India vs England: హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ తొలి టెస్టులో భార‌త్ స్పిన్న‌ర్లు అద‌ర‌గొడుతున్నారు. త‌మ స్పిన్ మాయాజాలంతో భార‌త బౌల‌ర్లు ఇంగ్లాండ్ ను దెబ్బ‌కొడుతున్నారు. ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ త‌న స్పిన్ తో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను దెబ్బ‌కొట్టాడు. త‌న కెరీర్ లో ఏకంగా 12వ సారి బెన్ స్టోక్స్ ను ఔట్ చేసి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో స్టోక్స్ ను అశ్విన్ ఔట్ చేయడం 25 ఇన్నింగ్స్ ల‌లో 12వ సారి. దీంతో టెస్టుల్లో ఒక బ్యాట్స్ మన్ ను ఎక్కువగా ఔట్ చేసిన భారత బౌలర్ కపిల్ దేవ్ రికార్డును అశ్విన్ సమం చేశాడు. కపిల్ దేవ్ పాకిస్థాన్ కు చెందిన ముదస్సర్ నాజర్ ను టెస్టు క్రికెట్ లో 12 సార్లు ఔట్ చేశాడు.

క‌ట్ట‌లు తెంచుకున్న బుమ్రా కోపం.. దెబ్బ‌కు ఎగిరిప‌డ్డ వికెట్ !

Latest Videos

 

📽️ R Ashwin to Ben Stokes

What a delivery 🙌 | | | pic.twitter.com/sxBGnhmhl0

— BCCI (@BCCI)

కాగా, టెస్టు క్రికెట్ లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఎక్కువ సార్లు ఔట్ చేసిన టాప్-3 ఆట‌గాళ్ల‌లో అందరూ ఎడమచేతి వాటం ప్లేయ‌ర్లు కావ‌డం విశేషం. టెస్టుల్లో డేవిడ్ వార్నర్ ను 11 సార్లు, అలిస్టర్ కుక్ ను 9 సార్లు అశ్విన్ ఔట్ చేశాడు. ఈ వెటరన్ స్పిన్నర్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయికి చేరువలో ఉన్నాడు. అప్పటికి అశ్విన్ టెస్టుల్లో 495 వికెట్లు పడగొట్టాడు.

Yashasvi Jaiswal: ఫార్మ‌ట్ ఏదైనా దంచికొట్టుడే.. టీమిండియాకు మ‌రో సెహ్వాగ్.. !

కాగా, హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ మొద‌టి మ్యాచ్ లో భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో  436 ప‌రుగులకు ఆలౌట్ అయింది. జైస్వాల్ 80 ప‌రుగులు, కేఎల్ రాహుల్ 86 ప‌రుగులు, ర‌వీంద్ర జ‌డేజా 87, శ్రీఖ‌ర్ భ‌ర‌త్ 41 ప‌రుగులు, అక్ష‌ర్ ప‌టేల్ 44 ప‌రుగులు చేశారు. భార‌త్ కు తొలి ఇన్నింగ్స్ లో 190 ప‌రుగులు అధిక్యం ల‌భించింది. ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో  246 ప‌రుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్ లో 289/6 (70.3) ప‌రుగుల‌తో మూడో రోజు ఆట‌ను కొన‌సాగిస్తోంది. 100 ప‌రుగుల అధిక్యం ఉంది. 
సౌర‌వ్ గంగూలీని బీట్ చేసిన రోహిత్ శ‌ర్మ.. !

click me!