Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా వికెట్ తీసిన తర్వాత పెద్దగా సంబరాలు చేసుకోడం తక్కువ. కానీ, హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ టెస్టులో మూడో రోజు బెన్ డకెట్ క్లీన్ బౌల్డ్ చేసిన తర్వాత బుమ్రా పంచ్‌ను విసురుతూ కమాన్ అంటూ బిగ్గరగా అరుస్తున్న వీడియో వైరల్ గా మారింది.
Jasprit Bumrah: క్రీడా ప్రపంచంలో ఆటగాళ్ల భావోద్వేగాల అప్పుడప్పుడు తీవ్రంగా ఉంటాయి. క్రికెట్ లో అయితే చెప్పనక్కర్లేదు. వికెట్ తీసినా, సెంచరీ కొట్టినా.. ఒక ప్లేయర్ మరో ప్లేయర్ ను రెచ్చగొట్టినా.. అప్పుడు వారి భావోద్వేగ స్పందనలకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇదే తరహాలో ప్రస్తుతం టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సంబంధించిన పలు దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జస్ప్రీత్ బుమ్రా వికెట్ తీసిన తర్వాత పెద్దగా సంబరాలు చేసుకోడం తక్కువ. కానీ, హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ టెస్టులో మూడో రోజు బెన్ డకెట్ క్లీన్ బౌల్డ్ చేసిన తర్వాత బుమ్రా పంచ్‌ను విసురుతూ కమాన్ అంటూ బిగ్గరగా అరుస్తున్న వీడియో వైరల్ గా మారింది.
భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేస్తుండగా, ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెల్ రెండు బౌండరీలు కొట్టి బుమ్రాను రెచ్చగొట్టాడు. దీంతో తన బౌలింగ్ సత్తా ఏంటో చూపిస్తూ నిప్పులు చెరిగిన బుమ్రా.. ఈ ఓవర్ లో తన కచ్చితమైన లైన్ లెంగ్ బౌలింగ్ ఇంగ్లాండ్ ప్లేయర్ కు దిమ్మదిగిరే షాక్ ఇచ్చాడు. బుమ్రా ఎల్బీడబ్ల్యూకు గట్టి విజ్ఞప్తి చేశాడు. కానీ, ఆన్ ఫీల్డ్ అంపైర్ దీన్ని నాటౌట్ అని పిలిచాడు. డీఆర్ఎస్ తీసుకోనందుకు కోపంగా ఉన్నానని రియాక్షన్ ఇచ్చారు. ఈ ఒక్క నిర్ణయంతో బాగా బ్యాటింగ్ చేస్తున్న డకెట్ కు జీవం వచ్చింది. కానీ అది ఎక్కువ సేపు నిలవలేదు.
తన్మయ్ అగర్వాల్ విధ్వంసం.. రవిశాస్త్రి రికార్డును బ్రేక్ చేసిన హైదరాబాదీ..!
19వ ఓవర్ లో బుమ్రా వేసిన అద్భుతమైన బంతికి వికెట్ ఎగిరిపడింది. బుమ్రా రివర్స్ స్వింగ్ బాల్ చూసి బిత్తరపోయిన బెన్ డకెట్ ఔట్ గా పెవిలియన్ కు చేరుకున్నాడు. అయితే ఈ ఓవర్ మొదటి, నాలుగో బంతికి డకెట్ ఫోర్లు కొట్టాడు. ఇప్పటికే డీఆర్ఎస్ తీసుకోకపోవడంతో నిరాశకు గురైన బుమ్రా, డకెట్ వేసిన ఈ రెండు ఫోర్లు అతడిలో మరింత కోపాన్ని నింపాయి. ఐదో బంతికి జస్ప్రీత్ డకెట్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన ఈ బంతి మంచి లెంగ్త్ లో పడింది. వికెట్ తీసిన తర్వాత బుమ్రా ఆనందం వెల్లివిరిసింది. పంచ్‌ను విసురుతూ కమాన్ అంటూ బిగ్గరగా అరుస్తున్న బుమ్రా వీడియో వైరల్ గా మారింది.
This aggression. 🥵💥 🇮🇳 pic.twitter.com/0W0IRlX6V9
— The Bharat Army (@thebharatarmy)Yashasvi Jaiswal: ఫార్మట్ ఏదైనా దంచికొట్టుడే.. టీమిండియాకు మరో సెహ్వాగ్.. !