Rohit Sharma : రోహిత్ శర్మ అద్బుతమైన ప్లేయర్ అనీ, అతని సారథ్యంలోనే టీమిండియా ముందుకు సాగుతుందని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా అన్నారు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటారని స్పష్టం చేశారు.
T20 World Cup 2024 - India: రాబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ కు ఎవరు నాయకత్వం వహిస్తారనేదానిపై హాట్ టాపిక్ కొనసాగుతోంది. హార్దిక్ పాండ్యా కోలుకోవడంతో రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తారా? లేదా? అనే చర్చ సాగింది. అయితే, బీసీసీఐ హార్దిక్ పాండ్యాకు షాక్ ఇస్తూ.. రాబోయే టీ20 వరల్డ్ కప్ 2024కు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ముందుకు సాగుతుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జైషా మాట్లాడుతూ.. "రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2024 టీ20 ప్రపంచకప్‌లో బార్బడోస్‌లో ట్రోఫీని అందుకుంటామని నేను మీకు వాగ్దానం చేయాలనుకుంటున్నాను" అన్నారు.
బీసీసీఐ సెక్రటరీ జై షా రాబోయే టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్‌కు కెప్టెన్ టోపీని రోహిత్ శర్మ ధరిస్తాడని ధృవీకరించారు. ఈ సారి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. వెస్టిండీస్, అమెరికాలలో మ్యాచ్ లు జరగనున్నాయి. 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత, హార్దిక్ పాండ్యా పొట్టి ఫార్మాట్‌లో భారత్‌కు కెప్టెన్‌గా ఉంటాడని అనేక నివేదికలు పేర్కొనడంపై హాట్ టాపిక్ అయింది. అయితే, గతంలో ముంబై ఇండియన్స్ ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్‌పై జైషా తన నమ్మకాన్ని ఉంచారు. అతని ట్రాక్ రికార్డ్ చూసి బీసీసీఐ మేనేజ్‌మెంట్ అతనికి మద్దతు ఇచ్చింది. రోహిత్ సారథ్యంలో భారత్ టీ20 ప్రపంచకప్‌ను గెలుస్తుందని జైషా ధీమాగా చెప్పారు.
IPL 2024 - CSK : ధోని తో జోడీ కట్టిన కత్రినా కైఫ్.. !
రాజ్‌కోట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జై షా మాట్లాడుతూ "2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో బార్బడోస్‌లో ట్రోఫీని అందుకుంటామని నేను మీకు వాగ్దానం చేయాలనుకుంటున్నానని" తెలిపారు. జైషా ప్రకటన తర్వాత అక్కడున్న ఆటగాళ్లు చప్పట్లు కొట్టడం.. అతనిని ప్రోత్సహించడం ప్రారంభించడంతో హాజరైన రోహిత్ శర్మ తన చిరునవ్వు ఆపుకోలేకపోయాడు. ఆనందంతో చప్పట్లు కొడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాఓ వైరల్ అవుతున్నాయి.
Jay Shah said 'India will lift the T20 World Cup under Rohit Sharma. Hitman's reaction on Jaisha's comments. pic.twitter.com/znBG3pbdDv
— mahe (@mahe950)
Jay Shah said "India will win the T20 World Cup under the leadership of Rohit Sharma". 🇮🇳pic.twitter.com/kPYEyf2WwO
— Johns. (@CricCrazyJohns)