India vs England: దెబ్బకొట్టిన సిరాజ్.. ఇంగ్లాండ్ ఆలౌట్ !

By Mahesh Rajamoni  |  First Published Feb 17, 2024, 1:51 PM IST

India vs England: ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో బెన్ డకెట్ 153 పరుగులు, ఓలీ పోప్ 39 పరుగులు, బెన్ స్టోక్స్ 41 పరుగులతో రాణించారు. మూడో రోజు భారత బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 319 పరుగులకు ఆలౌట్ అయింది.
 


India vs England: రాజ్ కోట్ లో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో భారత బౌలర్లు రాణించడంతో 319 పరుగులకు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. ఇంగ్లాండ్ ప్లేయర్లలో బెన్ డకెట్ 153 పరుగులు, ఓలీ పోప్ 39 పరుగులు, బెన్ స్టోక్స్ 41 పరుగులతో రాణించారు. రెండో రోజు సెంచరీ కొట్టిన బెన్ డకెట్ (133*) మూడో రోజు ఆటలో మరో 20 పరుగులు జోడించి 153 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో శుభ్ మన్ గిల్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ మినహా మూడో రోజు ఇంగ్లాండ్ ప్లేయర్లు పెద్దగా పరుగులు సాధించలేకపోయారు.

IPL 2024 - CSK : ధోని తో జోడీ క‌ట్టిన కత్రినా కైఫ్.. !

Latest Videos

చెలరేగిన సిరాజ్.. 

ఇంగ్లాండ్ 2వ రోజు స్టంప్స్ ను 35 ఓవర్లలో 207-2 ప‌రుగుల‌తో ముగించింది. అయితే, మూడో రోజు భారత బౌలర్లు రాణించడంతో మరో 102 పరుగులు చేసి 319 ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ చెలరేగాడు. 260 పరుగుల వరకు సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లాంగ్.. ఆ తర్వాత సిరాజ్ చెలరేగడంతో 59 పరుగులు మాత్రమే జోడించి 319 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ కు తోడూగా కుల్దీప్ యాదవ్ 2, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీసుకున్నారు. బుమ్రా, అశ్విన్ లు చెరో ఒక వికెట్ తీసుకున్నారు.

 

A spirited bowling spell powered with timber strikes 😎🔥

Relive 's 4-wicket haul 🎥🔽 | |

— BCCI (@BCCI)

IND VS ENG: 'బాజ్ బాల్' తో ధోని రికార్డును బ్రేక్ చేసిన బెన్ డ‌కెట్

click me!