IND vs ENG: 'బాజ్ బాల్' తో ధోని రికార్డును బ్రేక్ చేసిన బెన్ డ‌కెట్

By Mahesh Rajamoni  |  First Published Feb 17, 2024, 11:59 AM IST

IND vs ENG 3rd Test: భారత్ vs ఇంగ్లాండ్ మూడో టెస్టు రెండో రోజు ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు రికార్డుల మోత మోగించారు. భార‌త్ స్టార్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ 500 వికెట్లు సాధించిన ప్లేయ‌ర్ గా నిలువ‌గా, ఇంగ్లాండ్ ప్లేయ‌ర్లు 'బాజ్ బాల్' గేమ్ తో అద‌ర‌గొట్టాడు. 
 


India vs England: రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టు రెండో రోజు ఇంగ్లాండ్ 'బాజ్ బాల్' వ్యూహంతో అద‌ర‌గొట్టింది. వ‌న్డే త‌ర‌హాలో టెస్టు మ్యాచ్ ఆడుతూ ఇంగ్లాండ్ కు ఆ జ‌ట్టు ప్లేయ‌ర్లు శుభారంభం అందించారు. ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ బెన్ డ‌కెట్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. కేవలం 35 ఓవర్లలోనే ఇంగ్లాండ్ 207-2 (35 Ov) ప‌రుగులు సాధించింది. భార‌త్ తొలి ఇన్నింగ్స్ ను 445 ప‌రుగుల‌కు ముగించింది.

ఆ త‌ర్వాత తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ రెండో రోజు వ‌న్డే త‌ర‌హా గేమ్ ఆడింది. ఇంగ్లాండ్ ఓపెన‌ర్ జాక్ క్రాలే 15 ప‌రుగులు చేసి త్వ‌ర‌గానే ఔట్ అయినా.. మ‌రో ఓపెన‌ర్ బెన్ డ‌కెట్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఆట ముగిసే స‌మ‌యానికి బెన్ డ‌కెట్ 133* ప‌రుగులు, జో రూట్ 9* ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. మ‌రోసారి బాజ్ బాల్ గేమ్ తో ఇంగ్లాండ్ 2వ రోజు స్టంప్స్ ను 35 ఓవర్లలో 207-2 ప‌రుగుల‌తో ముగించింది. ఓలీ పోప్ 39 ప‌రుగుల‌తో రాణించాడు. మూడో రోజు 153 పరుగుల వద్ద బెన్ డకెట్ ఔట్ అయ్యాడు. 

Latest Videos

IPL 2024 - CSK : ధోని తో జోడీ క‌ట్టిన కత్రినా కైఫ్.. !

ఈ ఇన్నింగ్స్ లో బెన్ డ‌కెట్ భార‌త్ కు మూడు క్రికెట్ ఫార్మాట్ ల‌లో ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గ‌జ ప్లేయ‌ర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు. ఇండియాలో ఒక సెష‌న్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ప్లేయ‌ర్ గా నిలిచాడు. రాజ్ కోట్ లో  బెన్ డ‌కెట్ ఒక సెష‌న్ లో 114 ప‌రుగులు చేశాడు. దీంతో ఎంఎస్ ధోనిని అధిగ‌మించాడు. ఈ లిస్టులో భార‌త్ డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ టాప్ లో ఉన్నారు. సెహ్వాగ్ ఒక సెష‌న్ లో ముంబ‌యి వేదిక‌గా 2009లో శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్ లో 133 ప‌రుగులు సాధించాడు.

భార‌త్ లో ఒక సెష‌న్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన టాప్-5 క్రికెట‌ర్లు

  1. 133 - వీరేంద్ర సెహ్వాగ్ vs శ్రీలంక‌, ముంబ‌యి - 2009
  2. 114 - బెన్ డ‌కెట్ vs ఇండియా, రాజ్ కోట్ - 2024 *
  3. 109 - ఎంఎస్ ధోని vs ఆస్ట్రేలియా, చెన్నై - 2013
  4. 108 క‌రుణ్ నాయ‌క‌ర్ vs ఇంగ్లాండ్, చెన్నై - 2016
  5. 108 వీరేంద్ర సెహ్వాగ్ vs సౌతాఫ్రికా, చెన్నై - 2008

IND vs ENG: సెంచ‌రీ కోసం సర్ఫరాజ్ ఖాన్ ను బ‌లి చేశావా జ‌డ్డూ భాయ్.. ! రోహిత్ శ‌ర్మ కోపం చూశారా..?

భార‌త్ లో ఒక సెష‌న్ లో 100+ స్కోర్ సాధించిన తొలి విజిటింగ్ బ్యాట‌ర్ గా కూడా బెన్ డ‌కెట్ రికార్డు సృస్టించాడు. అలాగే, టీ విరామానికి - డే స్టంప్స్ కు మ‌ధ్య అత్య‌ధిక ప‌రుగులు చేసిన 3వ‌ ఇంగ్లాండ్ బ్యాట‌ర్ గా కూడా బెన్ డ‌కెట్ నిలిచాడు. ఈ లిస్టులో మ్యాట్ ప్రియ‌ర్ (121 ప‌రుగులు), వాలీ హమ్మండ్ (118 ప‌రుగులు) మొద‌టి రెండో స్థానాల్లో ఉన్నారు.

ఒంగోలులో హైపర్ ఆదిని చితకబాదిన జనం, అమ్మాయిని గెలకడంతో... అసలు ఏం జరిగింది?

click me!