ఇంగ్లాండ్ పై డ‌బుల్ సెంచ‌రీతో య‌శ‌స్వి జైస్వాల్ సాధించిన టాప్-5 రికార్డులు

By Mahesh Rajamoni  |  First Published Feb 3, 2024, 2:43 PM IST

Yashasvi Jaiswal: భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో తన తొలి డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఈ క్ర‌మంలోనే డ‌బుల్ సెంచ‌రీ కొట్టిన పిన్న వయస్కుడైన ప్లేయ‌ర్ గా దిగ్గ‌జ క్రికెట‌ర్ల స‌ర‌స‌న చోటు ద‌క్కించుకోవడంతో పాటు మరిన్ని రికార్డులు సాధించాడు.


Yashasvi Jaiswal: వైజాగ్ వేదిగా జ‌రిగిన రెండో టెస్టులో టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 7 సిక్స‌ర్లు, 19 ఫోర్ల‌తో డ‌బుల్ సెంచ‌రీని పూర్తి చేశాడు. ఈ క్ర‌మంలోనే స‌రికొత్త రికార్డులు సృష్టించాడు. జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ పై డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత ఓపెనర్ గా ఘ‌న‌త సాధించాడు. అలాగే, టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా నిలిచాడు.

ఇంగ్లాండ్ పై డ‌బుల్ సెంచ‌రీతో య‌శ‌స్వి జైస్వాల్ సాధించిన టాప్-5 రికార్డులు

Latest Videos

1. టెస్టుల్లో డ‌బుల్ సెంచ‌రీ కొట్టిన అతిపిన్న వ‌య‌స్కుడైన ప్లేయ‌ర్ గా య‌శ‌స్వి జైస్వాల్ రికార్డు సృష్టించాడు. భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్ల స‌ర‌స‌న చోటు సంపాదించాడు.

టెస్టుల్లో భారత్ తరఫున డ‌బుల్ సెంచ‌రీ కొట్టిన అతి పిన్న వయస్కులు 

21y 35d - వినోద్ కాంబ్లీ 224 ప‌రుగులు vs ఇంగ్లాండ్ - 1993
21y 55d - వినోద్ కాంబ్లీ 227 ప‌రుగులు vs జింబాబ్వే - 1993
21y 283d - సునీల్ గ‌వాస్కర్ 220 ప‌రుగులు vs వెస్టిండీస్ - 1971
22y 37d - య‌శ‌స్వి జైస్వాల్ 209 ప‌రుగులు vs ఇంగ్లాండ్ 2024 

అండర్‌-19 ప్రపంచకప్ లో సెమీస్ చేరిన భార‌త్

2. టెస్టులో భారత్ తరఫున డ‌బుల్ సెంచ‌రీ కొట్టిన ఎడమచేతి వాటం బ్యాట్స్ మ‌న్ గా కూడా య‌శ‌స్వి జైస్వాల్ రికార్డు సృష్టించాడు. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ త‌ర‌ఫున డ‌బుల్ సెంచ‌రీలు కొట్టిన భార‌త లెఫ్ట్ హ్యాండ్ బ్యాట‌ర్లు వీరే.. 

239 సౌర‌వ్ గంగూలీ vs పాకిస్తాన్ - బెంగళూరులో 2007
227 విన‌దో కాంబ్లీ vs జింబాబ్వే -  ఢిల్లీలో 1993
224 వినోద్ కాంబ్లీ vs ఇంగ్లాండ్ - ముంబయిలో 1993
206 గౌతమ్ గంభీర్ vs ఆస్ట్రేలియా - ఢిల్లీలో 2006
209 య‌శ‌స్వి జైస్వాల్ vs ఇంగ్లాండ్ - వైజాగ్ లో 2024

3. సునీల్ గవాస్కర్ సరసన జైస్వాల్ చేరాడు. ఇంగ్లాండ్ పై టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత ఓపెనర్ గా జైస్వాల్ నిలిచాడు. 1979 ఓవల్ టెస్టులో 221 పరుగులు చేసిన సునీల్ గవాస్కర్ సరసన జైస్వాల్ చేరాడు. అలాగే, సొంతగడ్డపై ఇంగ్లాండ్ పై డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్ గా జైస్వాల్ నిలిచాడు. న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే (2004) తర్వాత ఇంగ్లాండ్ పై డబుల్ సెంచరీ సాధించిన ఏకైక ఓపెనర్ గా నిలిచాడు.

గ‌ల్లీ క్రికెట‌ర్ నుంచి స్టార్ ప్లేయ‌ర్ గా.. ఇప్పుడు డీఎస్పీగా దీప్తి శ‌ర్మ

4. ఇంగ్లండ్‌పై భారత్ తరఫున ఒక రోజు ఆటలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్  లిస్టులో య‌శ‌స్వి జైస్వాల్ చోటు ద‌క్కించుకున్నాడు. 2016లో క‌రుణ్ నాయ‌ర్ ఇంగ్లాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఒక్క‌రోజులోనే 232 ప‌రుగులు చేసి ఈ జాబితాలో టాప్ లో ఉన్నాడు. రెండో స్థానంలో ఉన్న సునీల్ గ‌వాస్క‌ర్ 1979లో 179 పరుగులు చేసి రెండో స్థానంలో ఉండగా, ఇక య‌శ‌స్వి జైస్వాల్ 179 ప‌రుగులు చేసి మూడో ప్లేస్ లో ఉన్నాడు.

5. 22 ఏళ్ల జైస్వాల్ 179 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగడంతో 1వ రోజు భారత్ ఆట‌ను ముగించింది. ఇంగ్లాండ్ పై 150కి పైగా పరుగులు చేసిన నాల్గవ భారత ఓపెనర్ గా జైస్వాల్ నిలిచాడు. 2000 నుండి ఇంగ్లాండ్ పై 150-ప్లస్ స్కోర్ చేసిన నాల్గవ భారత ఓపెనర్‌గా జైస్వాల్ ఉన్నాడు. అయితే, రెండో రోజు డ‌బుల్ సెంచ‌రీ సాధించ‌డంతో టాప్ లోకి వ‌చ్చాడు. త‌న ఆరో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న జైస్వాల్  65-ప్లస్ వద్ద 600 పరుగులు పూర్తి చేశాడు.

పోరాడుతా.. ఎప్ప‌టికీ లొంగిపోను: డ‌బుల్ సెంచ‌రీ త‌ర్వాత య‌శ‌స్వి జైస్వాల్ వీడియో వైర‌ల్

click me!