India vs England: ఉప్పల్ టెస్టు మ్యాచ్ కు మస్తు క్రేజ్.. గ్రౌండ్ కు పొటెత్తిన క్రికెట్ లవర్స్ !

By Mahesh Rajamoni  |  First Published Jan 28, 2024, 10:46 AM IST

India vs England: హైదరాబాద్ లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టుబిగించింది. అయితే, ఉప్పల్ లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ కు క్రికెట్ లవర్స్ పొటెత్తారు. తొలి మూడు రోజులు నిత్యం దాదాపు 30 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్ చూడటానికి గ్రౌండ్ కు వచ్చారు. 
 


IND vs ENG - Uppal Cricket Stadium: హైదరాబాద్ లోని ఉప్ప‌ల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో  భార‌త్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు సాగిన ఆటలో భార‌త్ పై చేయి సాధించింది. అయితే, ఐదు టెస్టుల ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్ లో మొదటి టెస్టుకు హైదరాబాద్ వేదికైంది. ఉప్పల్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ కు మస్తు క్రేజ్ లభిస్తోంది. భారీ సంఖ్యలో క్రికెట్ లవర్స్ ఉప్పల్ స్టేడియంకు పొటెత్తుతున్నారు. ఇప్పటివరకు సాగిన మూడు రోజుల ఆటలో నిత్యం దాదాపు 30 వేల మంది ప్రేక్షకులు వచ్చారు. టెస్టు మ్యాచ్ లో నాలుగో రోజు ఆదివారం కావడంతో ప్రేక్షకులు మరింత పెరిగే అవకాశముంది.

ఇండియా - ఇంగ్లాండ్ మ‌ధ్య ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ కు క్రికెట్ అభిమానుల నుంచి భారీ స్పంద‌న ల‌భిస్తోంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ మొద‌లైన తొలి రోజు నుంచే స్టేడియం కిక్కిరిసిపోతోంది. తొలి రోజు 20 వేల మందికి పైగా అభిమానులు మ్యాచ్ చూడ‌టానిక వ‌చ్చారు. రెండో రోజు ఏకంగా 30,700 మంది క్రికెట్ ల‌వ‌ర్స్ మ్యాచ్ ను స్టేగియంలోకి వ‌చ్చి చూశారు. మూడు రోజు 25,561 మంది మ్యాచ్ ను చూడ‌టానికి రాగా, మ్యాచ్  నాలుగో రోజు ఆదివారం కావ‌డంతో ఉప్ప‌ల్ స్టేడియంకు వ‌చ్చే క్రికెట్ ల‌వ‌ర్స్ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంది.

Latest Videos

undefined

INDIA VS ENGLAND: రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన అభిమానికి 14 రోజుల రిమాండ్ !

 

Our Beautiful stadium 🔥🔥🥳🥳 pic.twitter.com/zb7eSxMhbO

— kaushik (@BeingUk7)

 

Mohammed Siraj is Bowling and "RCB RCB RCB" Chants in Uppal stadium at Hyderabad.

RCB Craze is unbelievable ♥️ pic.twitter.com/09HikFJHwa

— run machine Virat (@runmachine117)

ఉప్ప‌ల్ స్టేడియం వ‌స‌తుల‌పై విమ‌ర్శ‌లు.. 

చాలా రోజుల త‌ర్వాత భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ కు ఉప్ప‌ల్ లోని రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికైంది. పెద్ద సంఖ్య‌లో క్రికెట్ ల‌వ‌ర్స్ స్టేడియంకు పొటెత్తారు. అయితే, స్టేడియంలో త‌గిన వ‌స‌తులు క‌ల్పించ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లువురు నెటిజన్ల ఉప్ప‌ల్ స్టేడియంలో వ‌స‌తుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యంగా స్టేడియంలో టాయిలెట్లు దారుణంగా ఉన్నాయ‌నీ, ఫ్లోర్ పై మురుగు నీరు ప్ర‌వ‌హిస్తున్న‌ద‌ని పేర్కొన్నాడు.

క‌ట్ట‌లు తెంచుకున్న బుమ్రా కోపం.. దెబ్బ‌కు ఎగిరిప‌డ్డ వికెట్ !

  

So shocking to see the precarious conditions of the stands, the toilets and the VIP Boxes at the RG Cricket Stadium Uppal where we can see the foreigners too. What is doing? I draw the kind attention of our Hon’ble CM garu for his intervention as… pic.twitter.com/W6flMdeKm8

— Khaleequr Rahman (@Khaleeqrahman)

 

కుంబ్లే-హర్భజన్‌ జోడీని వెనక్కి నెట్టిన అశ్విన్-జ‌డేజా..టెస్టుల్లో భారత స్పిన్ జోడీ స‌రికొత్త చ‌రిత్ర

click me!