Ashwin-Jadeja : హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో టీమిండియా స్పిన్నర్లు అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల స్పిన్ జోడీ భారత దిగ్గజ ప్లేయర్లు అనిల్ కుంబ్లే - హర్భజన్ సింగ్ జోడీని వెనక్కినెట్టింది.
India vs England: భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టులో మూడో రోజు టీమిండియా పైచేయి సాధించింది. ముఖ్యంగా స్పిన్నర్లు అదరగొట్టారు. రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజాలు తమ అద్భుతమైన బౌలింగ్ తో రెండో ఇన్నింగ్స్ లోనూ ఇంగ్లాండ్ బ్యాటర్లను దెబ్బకొట్టారు. భారీగా పరుగులు చేయకుండా వారిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున విజయవంతమైన స్పిన్ జోడీగా రికార్డులకెక్కారు. తొలి టెస్టులో అశ్విన్, జడేజాలు మూడేసి వికెట్లు తీసుకోవడంతో భారత దిగ్గజ ప్లేయర్లు అనిల్ కుంబ్లే - హర్భజన్ సింగ్ ల స్పిన్ జోడీని వీరు అధిగమించారు.
భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టులో అశ్విన్, జడేజాలు చెరో మూడేసి వికెట్లు తీయడంతో టెస్టుల్లో ఈ జోడీ మొత్తం 506 వికెట్లు తీసినట్లైంది. దీంతో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ జోడీగా ఉన్న అనిల్ కుంబ్లే - హర్భజన్ సింగ్ ల 501 వికెట్ల రికార్డును అశ్విన్-జడేజాల జోడీ అధిగమించింది. అనిల్ కుంబ్లే - హర్భజన్ సింగ్ జోడీ 54 టెస్టులలో 501 వికెట్లు తీసుకోగా, అశ్విన్-జడేజాల జోడీ కేవలం 50 టెస్టుల్లోనే 506* వికెట్లు తీసుకోవడం విశేషం. ఈ లిస్టులో తర్వాతి స్థానంలో హర్భజన్ సింగ్-జహీర్‌ఖాన్ జోడీ 474 వికెట్లు, ఉమేశ్ యాదవ్ - అశ్విన్‌ల జోడీ 431 వికెట్లతో ఉన్నారు.
సూపర్ డెలివరీ.. అశ్విన్ స్పిన్ దెబ్బకు బిత్తరపోయిన బెన్ స్టోక్స్ ! కపిల్ దేవ్ రికార్డు సమం !
భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన జోడీలు
అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో టాప్-6 బెస్ట్ బౌలింగ్ జోడీలు:
కట్టలు తెంచుకున్న బుమ్రా కోపం.. దెబ్బకు ఎగిరిపడ్డ వికెట్ !