India vs England: రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన అభిమానికి 14 రోజుల రిమాండ్ !

By Mahesh Rajamoni  |  First Published Jan 28, 2024, 9:58 AM IST

India vs England: హైదరాబాద్ లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఒక అభిమాని సెక్యూరిటీని బ్రేక్ చేసి గ్రౌండ్ లోకి ప్ర‌వేశించి భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాదాలను తాకాడు. రోహిత్ శ‌ర్మ కాళ్లు మొక్కిన ఆ అభిమానికి 14 రోజుల రిమాండ్ విధించారు. 
 


IND v ENG - Rohit Sharma fan: ఉప్ప‌ల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ఆస‌క్తికరంగా మారుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ పై చేయి క‌నిపిస్తోంది కానీ, ప్ర‌స్తుతం రెండో ఇన్నింగ్స్ అడుతున్న ఇంగ్లాండ్ కు ఇప్ప‌టికే 128 ప‌రుగుల అధిక్యం  ల‌భించింది. ఒల్లీ పోప్ 149 ప‌రుగులు, రెహాన్ అహ్మద్ 17 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. వీరిద్ద‌రిని త్వ‌ర‌గా  ఔట్ చేయ‌క‌పోతే ఇంగ్లాండ్ కు భారీ అధిక్యం సాధించే అవ‌కాశ‌ముంది.

ఇదిలావుండ‌గా, ఉప్ప‌ల్ స్టేడియంలో మ్యాచ్ జ‌రుగుతుండ‌గా రోహిత్ శ‌ర్మ కాళ్లు మొక్కిన ఓ అభిమానికి 14 రోజుల రిమాండ్ విధించారు. మ్యాచ్ తొలి రోజు భార‌త్ బ్యాటింగ్ స‌మ‌యంలో చోటుచేసుకున్న ఈ  ఘ‌ట‌న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో.. విరాట్ కోహ్లీ పేరుతో జెర్సీని ధరించిన ఒక‌ అభిమాని అక్క‌డి సెక్యూరిటీని బ్రేక్ చేసిన గ్రౌండ్ లోకి ప్ర‌వేశించాడు. అలాగే, రోహిత్ శ‌ర్మ ద‌గ్గ‌ర‌కు వెళ్లి అత‌ని పాదాలను తాకాడు. వెంట‌నే అక్క‌డి సెక్యూరిటీ సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై రోహిత్ శ‌ర్మ అభిమానిని గ్రౌండ్ నుంచి బ‌య‌ట‌కు తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం ఈ వీడియో దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి.

Latest Videos

కుంబ్లే-హర్భజన్‌ జోడీని వెనక్కి నెట్టిన అశ్విన్-జ‌డేజా..టెస్టుల్లో భారత స్పిన్ జోడీ స‌రికొత్త చ‌రిత్ర

ఉప్ప‌ల్ స్టేడియంలో సెక్యూరిటీ ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డిన రోహిత్ శ‌ర్మ‌ అభిమానిని హ‌ర్షిత్ రెడ్డిగా గుర్తించారు. గ్రౌండ్ లో భ‌ద్ర‌తా ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డిన అత‌డిని స్టేడియం సెక్యూరిటీ పోలీసుల‌కు అప్ప‌గించింది. ఆ యువ‌కుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజ‌రుప‌ర్చారు. దీంతో న్యాయ‌స్థానం రోహిత్ శ‌ర్మ అభిమాని హ‌ర్షిత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్ర‌మంలోనే గ్రౌండ్ లో సెక్యూరిటీని మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు. ప్రేక్ష‌కుల‌కు కేటాయించిన సీట్ల‌లోనే వారు కూర్చోవాల‌ని మ‌రోసారి ఉప్ప‌ల్ స్టేడియం మేనేజ్మెంట్ ఆదేశాలు జారీ చేసింది.

 

Lucky Fan Meeted Rohit 🥲🥹 pic.twitter.com/7IN2yYsRmH

— Kiran (@KIRANPSPK45)

 

క‌ట్ట‌లు తెంచుకున్న బుమ్రా కోపం.. దెబ్బ‌కు ఎగిరిప‌డ్డ వికెట్ !

The moment a fan met Rohit Sharma in Hyderabad. pic.twitter.com/lVi78ywBsf

— Mufaddal Vohra (@mufaddal_vohra)

 సూప‌ర్ డెలివరీ.. అశ్విన్ స్పిన్ దెబ్బకు బిత్త‌ర‌పోయిన బెన్ స్టోక్స్ ! క‌పిల్ దేవ్ రికార్డు స‌మం !

click me!