India vs England: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ మొత్తం 6 వికెట్లు తీశాడు. దీంతో అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు.
India vs England - Ashwin: హైదరాబాద్ వేదికగా భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులు చేయగా, టీమిండియా 436 పరుగులు చేసి 190 పరుగుల ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా సునాయాసంగా గెలుస్తుందని అనిపించింది కానీ, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో ఓలీ పోప్ అద్భుత ప్రదర్శన చేసి 196 పరుగులు చేయడం, 231 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు తిరిగింది.
అనిల్ కుంబ్లేను వెనక్కి నెట్టిన రవిచంద్రన్ అశ్విన్
undefined
ఇంగ్లాండ్ తో జరిగిన హైదరాబాద్ టెస్టు మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టులో మొత్తంగా 6 వికెట్లు తీశాడు. దీంతో అశ్విన్ అనిల్ కుంబ్లేను అధిగమించి మరో రికార్డు సాధించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. ఇంగ్లాండ్ పై ఇప్పటివరకు అశ్విన్ 94 టెస్టు వికెట్లు పడగొట్టాడు. అనిల్ కుంబ్లే పేరిట 92 వికెట్లు ఉన్నాయి. ఈ లిస్టులో రెండో ప్లేస్ లో అశ్విన్ ఉండగా, ఇంగ్లాండ్ పై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ గా భగవత్ చంద్రశేఖర్ టాప్ లో ఉన్నారు. చంద్రశేఖర్ 95 వికెట్లు పడగొట్టాడు.
AUS vs WI: షమర్ జోసెఫ్ విశ్వరూపం.. ఆస్ట్రేలియాను చిత్తుచేసిన వెస్టిండీస్
ఇంగ్లాండ్ పై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
India vs England: ఉప్పల్ టెస్టు మ్యాచ్ కు మస్తు క్రేజ్.. గ్రౌండ్ కు పొటెత్తిన క్రికెట్ లవర్స్ !
రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచంలోని గొప్ప స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు సాధించాడు. భారత్ కు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడు. అశ్విన్ 2011లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి భారత స్పిన్ బౌలింగ్ లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టీమ్ఇండియా తరుపున 95 టెస్టుల్లో 490 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 156 వికెట్లు, టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు.
INDIA VS ENGLAND: పీకల్లోతు కష్టాల్లో భారత్.. పెవిలియన్ కు క్యూ కట్టిన ఆటగాళ్లు !