India vs England: భారత్‌ బలమే విజయాయుధం.. న‌లుగురు స్పిన్న‌ర్ల‌తో రంగంలోకి ఇంగ్లాండ్

By Mahesh RajamoniFirst Published Jan 21, 2024, 1:40 PM IST
Highlights

India vs England: భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఈ నెల 25 నుంచి హైద‌రాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జ‌ర‌గ‌నుండ‌గా, టెస్టు ఛాంపియ‌న్ షిప్ లో కీల‌కం కానున్న ఈ సిరీస్ గెలుపు కోసం ఇరు జ‌ట్లు క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. 
 

India vs England-Virat Kohli: భారత్-ఇంగ్లాండు మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. జ‌న‌వ‌రి 25న హైద‌రాబాద్ వేదిక‌గా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం క్రికెట్ ప్ర‌పంచంలో ఈ రెండు జట్లూ బ‌ల‌మైన టీమ్స్ గా ఉండ‌టంతో అందరి దృష్టి ఈ సిరీస్‌పైనే ఉంది. అలాగే, టెస్టు క్రికెట్ ఛాంపియ‌న్ షిప్ కు ఈ టెస్టు సిరీస్ కీల‌కం కావ‌డంతో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇంగ్లాండ్ బౌలింగ్-భార‌త్ బ్యాటింగ్ తో ర‌స‌వ‌త్త‌ర‌మైన పోటీ ఉండే అవ‌కాశాముంది.

స్వదేశంలో భారత్‌ను ఓడించేందుకు వ్యూహం సిద్దం

Latest Videos

ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు బెన్‌స్టోక్స్‌ కెప్టెన్‌గా, బ్రెండన్‌ మెకల్లమ్‌ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటిన త‌ర్వాత ఆ జ‌ట్టు విజ‌య ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తోంది. అప్ప‌టి నుంచి ఇప్పటి వరకు ఆ జట్టు ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోలేదు. భారత్‌లో టీమిండియాను ఓడించడం క్రికెట్‌లో అత్యంత కష్టమైన పని అని ఇద్దరికీ తెలుసు.. ఈ కష్టమైన పని చేయడానికి ఇంగ్లాండ్ సిద్ధ‌మైంది. భారత్ బలాన్ని తమ బలంగా చేసుకుని స్వదేశంలో భారత్‌ను ఓడిస్తామ‌ని చెబుతోంది.

భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ బ‌ద్ద‌లు కొట్ట‌బోయే టాప్-5 రికార్డులు ఇవే..

స్పిన్న‌ర్ల‌ను రంగంలోకి దించుతున్న ఇరుజ‌ట్లు

భార‌త్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో బ్యాట‌ర్స్ తో పాటు బౌల‌ర్ల హ‌వా కూడా కొన‌సాగ‌నుంది. భారత పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. టెస్టు మ్యాచ్ ల‌లో ఇక్కడ స్పిన్నర్లదే ఆధిపత్యం. విదేశీ జట్ల బ్యాట్స్‌మెన్ ఇక్కడ స్పిన్ ఉచ్చులో ప‌డ‌టం ఖాయం. ఇంగ్లాండ్ కూడా తమ స్పిన్ ఆయుధంతో భారత్‌ను ఓడించేందుకు ప్రయత్నిస్తుందనీ, అందుకోసం జట్టులో భారీ మార్పులు చేసిందని బ్రిటీష్ టీమ్ పేర్కొంది. ఈ క్ర‌మంలోనే భారత పర్యటనకు నలుగురు స్పిన్నర్లను ఇంగ్లండ్ జట్టు తీసుకువస్తోంది. వీరిలో ముగ్గురు స్పిన్నర్లు భారత్ లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడ‌లేదు. అలాగే, ఇద్ద‌రు టెస్టుల్లో అరంగేట్రం చేయ‌బోతున్నారు. ఈ నలుగురు స్పిన్నర్లు జాక్ లీచ్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్. రెహాన్ ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున ఒక మ్యాచ్ ఆడాడు. అతని ఆటతీరు భారత్ లో బాగా రాణించగలడని సూచిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీశాడు. జాక్ లీచ్ జట్టులో అనుభవజ్ఞుడైన స్పిన్నర్.

పిచ్‌ను కీలకం.. 

భారత్-ఇంగ్లాండ్ టెస్టుకు ఇక్క‌డి పిచ్ కూడా కీలంగా ఉండ‌నుంది. తొలి మ్యాచ్ హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. జాక్ లీచ్, అహ్మద్ ఖచ్చితంగా ఆడతారు. ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే బషీర్, టామ్‌లలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.

తగ్గేదేలే.. గ్రౌండ్ లో రెచ్చ‌గొట్టిన బంగ్లాదేశ్.. గెలుపుతో గుణ‌పాఠం చెప్పిన భార‌త్

click me!