New Zealand vs Pakistan: ఇఫ్తికార్ అహ్మద్ నేతృత్వంలోని స్పిన్నర్లు రాణించడంతో న్యూజిలాండ్ కేవలం 92 పరుగులకే ఆలౌట్ కావడంతో 5వ టీ20 లో పాకిస్థాన్ 42 పరుగుల తేడాతో కీవీస్ పై గెలిచింది. అయితే, ఇప్పటికే న్యూజిలాండ్ 4-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది.
New Zealand vs Pakistan: నూజిలాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో పాకిస్తాన్ వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. చివరి మ్యాచ్, ఐదో టీ20లో కీవీస్ జట్టుపై విజయం సాధించింది. పాక్ బౌలర్లు రాణించడంతో 5వ టీ20లో 42 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. 135 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయింది. అంతకుముందు, పాకిస్తాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అరంగేట్రం ఆటగాడు హసేబుల్లా ఖాన్ డకౌట్ గా వెనుదిరిగాడు. పవర్‌ప్లేలో బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ పోరాడటంతో పాకిస్తాన్ కేవలం 29 పరుగులు మాత్రమే చేయగలిగింది.
బాబర్ 24 బంతులు ఎదుర్కొన్న తర్వాత కేవలం 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. రిజ్వాన్ 38 పరుగులు, ఫఖర్ జమాన్ 16 బంతుల్లో 33 పరుగులతో పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించాడు. టిమ్ సౌథీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్ లు తలా రెండు వికెట్లు తీసుకున్నారు. 20 ఓవర్లలో పాకిస్తాన్ 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. 134 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ పాకిస్తాన్ బౌలింగ్ ముందు చేతులెత్తేసింది. కీవీస్ బ్యాటర్లలో ఫిన్ అలెన్ 22 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 26 పరుగులతో రాణించారు. మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించకపోవడంతో 17.2 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌట్ అయింది.
undefined
తగ్గేదేలే.. గ్రౌండ్ లో రెచ్చగొట్టిన బంగ్లాదేశ్.. గెలుపుతో గుణపాఠం చెప్పిన భారత్
పాక్ బౌలర్లలో ఇఫ్తికర్ అహ్మద్ 3 వికెట్లు తీసుకున్నాడు. షాహీన్ అఫ్రిది 2, మహ్మద్ నవాజ్ 2 వికెట్లు, జమాన్ ఖాన్, ఉసామా మీర్ లు తలా ఒక వికెట్ తీసుకున్నారు. అద్బుత బౌలింగ్ తో న్యూజిలాండ్ ను దెబ్బకొట్టి పాకిస్తాన్ కు విజయాన్ని అందించిన ఇఫ్తికర్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ సిరీస్ లో ధనాధన్ బ్యాటింగ్ తో అదరగొట్టిన న్యూజిలాండ్ ప్లేయర్ ఫిన్ అలెన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.
Reflections on a memorable series from the KFC Player of the Series - Finn Allen 🏏 pic.twitter.com/bgBfuJZWVx
— BLACKCAPS (@BLACKCAPS)IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ టెస్టు టిక్కెట్ల ధరలు రూ.200 నుంచే.. వీరికి ఉచితంగానే.. !