
Asian Marathon Hongkong-Man singh: ఆసియా మారథాన్ లో భారత్ కు చెందిన మాన్ సింగ్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఆసియా మారథాన్ లో మాన్ సింగ్ మొదటి స్థానం సాధించి స్వర్ణం గెలిచారు. రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో కజకిస్థాన్ లు నిలిచాయి. భారత్ కు చెందిన మాన్ సింగ్ 2: 14: 19 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. 73 ఏండ్ల చరిత్రను మాన్ సింగ్ తిరగరాశారు. అంతకుముందు 1982 ఆసియా మారథాన్ లో భారత్ పతకం సాధించింది. మాన్ సింగ్ సాధించిన ఈ విజయం భారత్ కు స్వర్ణ విజయం. 73 ఏళ్ల తర్వాత ఆసియా మారథాన్ క్రీడల్లో భారత్ స్వర్ణ పతకం సాధించింది. అంతకుముందు 1951లో భారత్ కు స్వర్ణ పతకం లభించింది.
మాన్ సింగ్ 2023లో 8వ స్థానంలో.. ఇప్పుడు స్వరణం పతకంలో..
2023 ఆసియా మారథాన్ గేమ్స్ లో భారత్ కు చెందిన మాన్ సింగ్ 8వ స్థానంలో నిలిచారు. 18 మంది అథ్లెట్లలో మరో భారతీయుడు బెలియప్ప 12వ స్థానంలో నిలిచాడు. చివరిసారిగా 1982 ఆసియా క్రీడల్లో మారథాన్ ఈవెంట్లో భారత్ పతకం సాధించింది. ఆ తర్వాత హోసూరు కుక్కప్ప సీతారన్ 1982లో కాంస్య పతకం సాధించాడు. 1951లో ఛోటా సింగ్ బంగారు పతకం, సూరత్ సింగ్ మాతుర్ కాంస్య పతకం సాధించారు. 2023లో మాన్ సింగ్ 2 గంటల 16 నిమిషాల 59 సెకన్లలో రేసును ముగించి 8వ స్థానంలో నిలిచాడు. అయితే, 2024లో 35 ఏళ్ల మాన్ సింగ్ 2 గంటల 14 నిమిషాల 19 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణ పతకం సాధించాడు.