భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖపట్టణంలో ఇవాళ ప్రారంభమైంది.
విశాఖపట్టణం: ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం నాడు విశాఖపట్టణంలో ప్రారంభమైంది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైపాల్ భారత ఇన్నింగ్స్ ను ప్రారంభించారు.
హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ లో భారత జట్టు ఓటమిని మూటగట్టుకుంది. ఇంగ్లాండ్ జట్టుతో ఇండియా ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. మొదటి టెస్ట్ లో విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు భారత్ పై 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో టెస్టులో ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తుంది.
also read:IND vs ENG 1st Test: ఉప్పల్ స్టేడియంలో రోహిత్ శర్మ పాదాలను తాకిన అభిమాని, వీడియో వైరల్
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ భారత్ కు అద్భుతమైన ఆరంభం అందిస్తే ఇంగ్లాండ్ జట్టుపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఓపెనర్ జోడీపై ఒత్తిడి పెంచేందుకు ఇంగ్లాండ్ కూడ వ్యూహాలతో సిద్దమైంది. భారత జట్టుకు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ల జోడి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ప్రతి ఓవర్ కు ఇంగ్లాండ్ బౌలర్లపై భారత జట్టు పై చేయి సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ముకేష్ కుమార్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, రజత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, ఆశ్విన్,శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), కుల్ దీప్ యాదవ్, ఆశ్విన్, బుమ్రా,
ఇంగ్లాండ్ జట్టు
బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్, పోప్, జోరూట్, జాక్ క్రాలే,బెన్ డకెట్, బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్, హార్ట్ లీ,జేమ్స్ అండర్సన్