IND vs ENG: నేటీ నుంచి రెండో టెస్టు ప్రారంభం.. పలు రికార్డులపై కన్నేసిన అశ్విన్..

By Rajesh Karampoori  |  First Published Feb 2, 2024, 5:00 AM IST

IND vs ENG: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత స్టార్ స్పిన్ బౌలర్ అశ్విన్ 6 వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే అశ్విన్ రాణించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో అశ్విన్  పలు భారీ రికార్డులను నమోదు చేసే అవకాశముంది. ఇంతకీ ఆ రికార్డులేంటో తెలుసుకుందాం. 


IND vs ENG: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు విశాఖపట్నం వేదికగా భారత్- ఇంగ్లండ్ లు రెండో టెస్టు మ్యాచ్ ఆడనున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో వెనుకబడిన టీమిండియా రెండో మ్యాచ్‌లో పుంజుకుని సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. గాయం కారణంగా రెండో టెస్టు మ్యాచ్‌కు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. టీమిండియా ఆల్ రౌండర్ జడేజా దూరం కావడంతో స్టార్ స్పిన్ బౌలర్ ఆర్ అశ్విన్ పై పెద్ద బాధ్యత పడనుంది.తాజాగా టెస్టుల్లో ర్యాంకింగ్స్‌లో నంబర్ 1గా నిలిచిన అశ్విన్.. మరిన్ని రికార్డులపై కన్నేశాడు. 

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అశ్విన్ 6 వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే అశ్విన్ రాణించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ ఒకటి రెండు కాదు 4 భారీ రికార్డులను నమోదు చేసే అవకాశముంది. ఇంతకీ ఆ రికార్డులేంటో తెలుసుకుందాం. 

Latest Videos

ఆ భారీ రికార్డులివే.. 

  • ఇంగ్లండ్‌తో 20 టెస్టులాడిన అశ్విన్ ఇప్పటి వరకు మొత్తం 93 వికెట్లు పడగొట్టాడు.ఇతడి కంటే ముందు భారత్ తరఫున భగవత్ చంద్రశేఖర్ టెస్టులో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. 23 టెస్టుల్లో 95 వికెట్లు తీశాడు. రెండో టెస్టు మ్యాచ్‌లో కేవలం మూడు వికెట్లు తీస్తే..ఇంగ్లండ్ పై అత్యధిక వికెట్లు తీసిన భారత్ ఆటగాడిగా నిలుస్తాడు.  అలాగే.. ఇంకో 7 వికెట్లు తీస్తే వంద వికెట్లు  తీసిన తొలి భారతీయ బౌలర్ గా రికార్డులకెక్కనున్నాడు.  
  • ఆర్ అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో ఇప్పటి వరకూ మొత్తం 96 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో 496 వికెట్లు సాధించారు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ కేవలం 4 వికెట్లు తీస్తే టెస్టు క్రికెట్‌లో  500 వికెట్లు తీసిన 9వ బౌలర్‌గా, భారత్‌ నుంచి 500 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.
  • టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఇప్పటి వరకు ఆడిన 96 టెస్టు మ్యాచ్‌ల్లో 34 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ టెస్ట్ లో ఐదు వికెట్లు తీయడంలో సఫలమైతే.. టెస్టుల్లో భారత్ తరఫున 35 ఐదు వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే రికార్డును అతను బద్దలు చేస్తాడు.
  • ఇప్పటివరకు భారత్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అనిల్ కుంబ్లే నిలిచాడు. కుంబ్లే భారత గడ్డపై 350 వికెట్లు పడగొట్టాడు. కాగా, అశ్విన్ 56 టెస్టుల్లో 343 వికెట్లు తీశాడు. అశ్విన్ కేవలం 8 వికెట్లు తీసి కుంబ్లేను అధిగమించి భారత్‌లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
click me!