ICC Under 19 World Cup 2024 : భార‌త్ vs బంగ్లాదేశ్ మ్యాచ్ టైమ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్స్, పిచ్ రిపోర్టు ఇదే..

By Mahesh Rajamoni  |  First Published Jan 20, 2024, 12:12 PM IST

Under-19 World Cup 2024: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ ట్రోఫీని భారత్ 5 సార్లు గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆరోసారి ట్రోఫీని గెలిచి చ‌రిత్ర‌ను సృష్టించాల‌నుకుంటోంది. మెగా టోర్నీలో బంగ్లాదేశ్ తో భార‌త్ తొలి మ్యాచ్ ఆడ‌నుంది. టీమ్స్ , లైవ్ స్ట్రీమింగ్, టైమ్, షెడ్యూల్, పిచ్ రిపోర్టు స‌హా పూర్తి వివ‌రాలు ఇవిగో.. 
 


India U19 vs Bangladesh U19: ఐసీసీ అండ‌ర్-19 ప్ర‌పంచ క‌ప్ 2024 మెగా టోర్నీ శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టీమిండియా  శ‌నివారం తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అండర్-19 ప్రపంచకప్ ట్రోఫీని భారత్ 5 సార్లు గెలుచుకుని రికార్డు సృష్టించింది. చివరిసారిగా 2022లో యశ్ ధుల్ కెప్టెన్సీలో భారత జట్టు రికార్డు స్థాయిలో ఐదోసారి టైటిల్ గెలుచుకుంది. ఇక ఆరోసారి ట్రోఫీని గెల‌వాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. అయితే, శ‌నివారం జ‌ర‌గ‌బోయే భార‌త్-బంగ్లాదేశ్ అండ‌ర్-19 వ‌రల్డ్ క‌ప్ 2024 మ్యాచ్ టీమ్స్ , లైవ్ స్ట్రీమింగ్, టైమ్, షెడ్యూల్, పిచ్ రిపోర్టు స‌హా పూర్తి వివ‌రాలు ఇలా వున్నాయి..

భ‌ర‌త్ vs బంగ్లాదేశ్ ICC U-19 ప్రపంచ కప్ 2024 మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

Latest Videos

భారత్ vs బంగ్లాదేశ్ ఐసీసీ అండ‌ర్-19 పురుషుల ప్రపంచ కప్ 2024 మ్యాచ్ జనవరి 20 (శనివారం) జరగనుంది.

భారత్ vs బంగ్లాదేశ్ ఐసీసీ అండ‌ర్-19 పురుషుల ప్రపంచ కప్ 2024 మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

ఇండియా vs బంగ్లాదేశ్ ఐసీసీ అండ‌ర్-19 పురుషుల ప్రపంచ కప్ 2024 మ్యాచ్ మంగౌంగ్ ఓవల్, బ్లూమ్‌ఫోంటైన్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. 

భారత్ vs బంగ్లాదేశ్ ఐసీసీ-19 పురుషుల ప్రపంచ కప్ 2024 మ్యాచ్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది?

భారత్ vs బంగ్లాదేశ్ ఐసీసీ అండ‌ర్-19 పురుషుల ప్రపంచ కప్ 2024 మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్రారంభమవుతుంది.

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఐసీసీ అండ‌ర్-19 పురుషుల ప్రపంచ కప్ 2024 మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం, లైవ్ స్ట్రీమింగ్ ఎక్క‌డ చూడ‌వ‌చ్చు? 

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారత్ vs బంగ్లాదేశ్ ఐసీసీ అండ‌ర్-19 పురుషుల ప్రపంచ కప్ 2024 మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడ‌వ‌చ్చు. అలాగే, ఇండియాలో డిస్నీ+హాట్‌స్టార్‌లో కూడా ఈ మ్యాచ్ ను లైవ్ స్ట్రీమింగ్ చూడ‌వ‌చ్చు. 

విరాట్ జంపింగ్.. బుమ్రా బౌలింగ్ ! మ్యాచ్‌ని మలుపు తిప్పిన కింగ్ కోహ్లీ.. !

భారత్ vs బంగ్లాదేశ్ ఐసీసీ అండ‌ర్-19 జ‌ట్లు వివ‌రాలేంటి?

భారత్ అండర్-19 జట్టు: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్) ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, మురుగన్ అభిషేక్, అరవెల్లి అవనీష్(వికెట్ కీప‌ర్), నమన్ తివారీ, రాజ్ లింబానీ, సౌమీ పాండే, ఆరాధ్య శుక్లా, ఇన్నేష్ మహాజన్ ధనుష్ గౌడ, రుద్ర పటేల్, ప్రేమ్ దేవ్కర్, మహమ్మద్ అమన్, అన్ష్ గోసాయి

బంగ్లాదేశ్ అండర్-19 జట్టు: అషికుర్ రహ్మాన్ షిబ్లీ(వికెట్ కీప‌ర్), ఆదిల్ బిన్ సిద్దిక్, జిషాన్ ఆలం, చౌదరి ఎండీ రిజ్వాన్, అరిఫుల్ ఇస్లాం, అహ్రార్ అమీన్, మహ్మద్ షిహాబ్ జేమ్స్, మహ్ఫుజుర్ రహ్మాన్ రబీ(కెప్టెన్), షేక్ పెవెజ్ జిబోన్, ఎండీ రఫీ ఉజ్జామాన్, రఫీ ఉజ్జామాన్ రోహనత్ దౌల్లా బోర్సన్, మరుఫ్ మృధా, ఎండీ ఇక్బాల్ హుస్సేన్ ఎమ్మాన్, అష్రఫుజ్జమాన్ బోరన్నో.

పిచ్ రిపోర్ట్ ఏం చెబుతోంది?

పిచ్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే ఇక్క‌డ గ్రౌండ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇది పరుగులు చేయడానికి అద్భుతమైన వేదికగా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొత్త బాల్ ఫాస్ట్ బౌలర్‌లకు సహాయం చేయగలిగినప్పటికీ, బంతి తన ప్రకాశాన్ని కోల్పోతున్నందున పరిస్థితులు మరింత బ్యాట్స్‌మన్-ఫ్రెండ్లీగా మారవచ్చని అంచనాలున్నాయి.

సూప‌ర్ ఓవ‌ర్ రూల్స్ ను బ్రేక్ చేసిన రోహిత్ శ‌ర్మ.. ఆ విమ‌ర్శ‌ల్లో నిజ‌మెంత‌..?

click me!