IND v AFG: భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 షెడ్యూల్, టీమ్స్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ రిపోర్ట్ వివరాలు ఇవిగో..

By Mahesh Rajamoni  |  First Published Jan 10, 2024, 4:45 PM IST

India Afghanistan T20 Series: భారత్ వ‌ర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ మొహాలీలో జరగనుంది. భార‌త స్టార్ ప్లేయ‌ర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు దాదాపు 14 నెలల తర్వాత టీ20 ఆడనున్నారు. ఈ సిరీస్ కు సంబంధించిన షెడ్యూల్, టైమ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ రిపోర్టు వివ‌రాలు గ‌మ‌నిస్తే.. 
 


IND v AFG T20 Series full schedule: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. టీమిండియాకు ఈ సిరీస్ చాలా కీలకం. ఎందుకంటే, ఈ ఏడాది మధ్యలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2024 కు ముందు భార‌త్ ఆడే చివరి టీ20 సిరీస్ ఇదే. అలాగే, భారత స్టార్ ప్లేయ‌ర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 14 నెలల తర్వాత టీ20 క్రికెట్లోకి పునరాగమనం చేయనున్నారు. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోయినప్పటి నుంచి ఈ ఇద్దరు ఆటగాళ్లు టీ20 క్రికెట్ కు దూరంగా ఉన్నారు.

భారత్- అఫ్గానిస్థాన్ జట్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

Latest Videos

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మ‌న్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్). ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్ రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జానా, అజ్ముల్లా ఉమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ రహమాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్. 

భార‌త టీ20 జ‌ట్టులోకి రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్..

భారత్-ఆఫ్ఘనిస్తాన్ హెడ్ టూ హెడ్ రికార్డులు

టీ20 క్రికెట్ లో భారత్, ఆఫ్ఘనిస్తాన్  జట్లు 5 సార్లు తలపడ్డాయి. ఒక మ్యాచ్ అసంపూర్తిగా ముగిసింది. మిగిలిన 4 మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. భారత్- అఫ్గానిస్థాన్ జట్ల మధ్య తొలిసారి ద్వైపాక్షిక టీ20 సిరీస్ జరగనుంది. గతంలో టీ20 వరల్డ్ క‌ప్, ఆసియాకప్ లో మాత్ర‌మే ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి.

భారత్-ఆఫ్ఘనిస్తాన్  టీ20 సిరీస్ లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ వివరాలు

స్పోర్ట్స్ 18 నెట్ వ‌ర్క్ భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ ను ప్రత్యక్ష ప్రసారం చేయ‌నుంది. అలాగే, జియో సినిమా యాప్, వెబ్ సైట్ లో కూడా టీ20 సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ ను ఉచితంగా చూడ‌వ‌చ్చు. 

IND v AFG: ప్రపంచ రికార్డుతో పాటు ధోనీ రికార్డు బద్దలు కొట్టనున్న రోహిత్ శర్మ..

భారత్-అఫ్గానిస్థాన్ టీ20 మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుంది?

భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు భారత్- అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్లు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు టాస్ జరగనుంది.

భారత్-అఫ్గానిస్థాన్ తొలి టీ20 పిచ్ రిపోర్ట్

భార‌త్-అఫ్గానిస్థాన్ తొలి టీ20 మొహాలీలో జ‌ర‌గ‌నుంది. పీసీఏ స్టేడియంను బ్యాట్స్ మెన్ స్వర్గంగా భావిస్తారు. అయితే ఈ వికెట్ ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండ‌నుంది. స్పిన్నర్లకు కూడా పిచ్ అనుకూలించే అవ‌కాశముంది. అయితే, మంచు కీల‌కంగా మారే అవ‌కాశ‌ముంది. మొహాలీ వేదికగా జరిగిన చివరి టీ20లో ఆస్ట్రేలియా 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 183. మొహాలీ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

IPL 2024: ఐపీఎల్ 2024కు ముహూర్తం ఖరారు.. వేదిక మార్చడం పై క్లారిటీ

భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ షెడ్యూల్

తొలి టీ20- 11 జనవరి- మొహాలీ

రెండో టీ20- 14 జనవరి- ఇండోర్

మూడో టీ20- 17 జనవరి- బెంగళూరు

INDvsAFG: భారత్ తో టీ20 సిరీస్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ కు బిగ్ షాక్..

click me!