India Afghanistan T20 Series: జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. అయితే, సిరీస్ కు ముందే ఆఫ్ఘన్ టీమ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
India Afghanistan T20 Series: భారత్ టీ20 సిరీస్ ప్రారంభం కావడానికి ముందే ఆఫ్ఘనిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ టీమ్ స్లార్ ప్లేయర్, స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ సిరీస్ మొత్తం నుంచి దూరమయ్యాడు. వివరాల్లోకెళ్తే.. గురువారం నుంచి భారత్ తో ప్రారంభం కానున్న మూడు టీ20ల సిరీస్ లో రషీద్ ఖాన్ పాల్గొనడం లేదు. 25 ఏళ్ల స్పిన్నర్ జట్టుతో కలిసి చండీగఢ్ కు వెళ్లి గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్ సెషన్లలో చురుకుగా పాల్గొంటున్నప్పటికీ, అతను గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదనీ, గాయం తీవ్రత నేపథ్యంలో భారత్-అప్ఘనిస్థాన్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడని ఆ టీమ్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ ధృవీకరించాడు. కొన్ని నెలల క్రితం జరిగిన వెన్నునొప్పి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న రషీద్ ఖాన్ టీమ్ తో కలిసి ఆడటానికి కొంత సమయం పడుతుందని తెలిపాడు.
రషీద్ ఖాన్ గాయం గురించి మరింతగా వివరించిన ఇబ్రహీం జద్రాన్.. రషీద్ ఖాన్ పూర్తి ఫిట్ నెస్ తో లేకపోయినా జట్టుకు తోడుగా ఉంటున్నాడని తెలిపారు. తమ అంచనాలకు తగ్గట్టుగా అతను ఫిట్ నెస్ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీమ్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడనీ, ఈ సిరీస్ లో ఆడే అవకాశంలేదని తెలిపాడు. రషీద్ అందుబాటులో లేకపోయినా జట్టు బలమైన పోటీదారుగా ఉందనీ, మాకు నమ్మకమైన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని జద్రాన్ తెలిపాడు. మరింత మంది ప్లేయర్స్ ఆకట్టుకునే ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెప్పాడు. రషీద్ ఖాన్ అనుభవం తమకు వెలకట్టలేనిది అయినప్పటికీ, టీంలోని ఇతర ప్లేయర్స్ రాణిస్తారనే నమ్మకం ఉందని తెలిపాడు.
చేతులు లేకపోతేనేమీ విలువిద్యలో అద్భుతాలు.. 'గోల్డెన్ గర్ల్ ఆఫ్ ఇండియా శీతల్ దేవి..
అఫ్ఘన్ జట్టులో రషీద్ ఖాన్ లేకపోవడంతో స్పిన్ విభాగానికి నూర్ అహ్మద్, ముజీబ్-యువర్-రెహ్మాన్ నాయకత్వం వహించనుండగా, అనుభవజ్ఞుడైన మహ్మద్ నబీ కూడా ఎంపికకు అందుబాటులో ఉండనున్నారు. నబీ టీమ్ లో ఉండటం గురించి ప్రస్తావించిన జద్రాన్.. "నబీ మా జట్టులో అత్యంత సీనియర్ ఆటగాడు, అతను మైదానంలో ఉండాలి. ఆయన అనుభవ సంపద ఎంతో గొప్పది' అని పేర్కొన్నారు. భారత్ తో ద్వైపాక్షిక సిరీస్ కోసం ఎదురుచూస్తున్న జద్రాన్ భారత గడ్డపై ఆడటం కష్టమని అంగీకరించినప్పటికీ తమ నైపుణ్యాలను ప్రదర్శించాలనే జట్టు సంకల్పాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో కూడిన బలమైన భారత జట్టును ఎదుర్కోవడానికి ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు.
IND V AFG: ప్రపంచ రికార్డుతో పాటు ధోనీ రికార్డు బద్దలు కొట్టనున్న రోహిత్ శర్మ