IPL 2024: ఐపీఎల్ 2024కు ముహూర్తం ఖరారు.. వేదిక మార్చడం పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

By Mahesh Rajamoni  |  First Published Jan 10, 2024, 4:16 PM IST

IPL 2024: భారత క్రికెట్ లీగ్ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2024 (ఐపీఎల్2024) సీజన్  కు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. అయితే, భారత సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వేదిక‌ను మారుస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇదే క్ర‌మంలో ఐపీఎల్ నిర్వ‌హించే వేదికపై బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.  
 


IPL 2024-BCCI:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2024 (ఐపీఎల్2024) సీజన్  కు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. అయితే, భారత సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వేదిక‌ను మారుస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇదే క్ర‌మంలో ఐపీఎల్ నిర్వ‌హించే వేదికపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఐపీఎల్ ను భారతదేశంలో నిర్వహించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

అలాగే, ఐపీఎల్ 2024 మార్చి 22న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల తేదీలను అదే సమయంలో ప్రకటించే అవకాశం ఉంది. దీంతో భార‌త్ లో కాకుండా విదేశాల్లో ఐపీఎల్ నిర్వ‌హిస్తార‌ని టాక్ వినిపించింది. కానీ, అలాంటిదేమీ లేద‌ని బీసీసీఐ వ‌ర్డాలు పేర్కొంటున్నాయి. ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు త‌గిన ఏర్పాట్లు చేస్తున్నామ‌ని వెల్ల‌డించాయి. “ఐపీఎల్ టోర్నమెంట్‌ను దేశం వెలుపలికి మ‌ర్చే ఉద్దేశం లేదు. ఇదే స‌మ‌యంలో సార్వత్రిక ఎన్నికలు వ‌చ్చే అవకాశముంది. ఆ సమయంలో ఏదైనా రాష్ట్రం మ్యాచ్‌ను నిర్వహించకూడదనుకుంటే, మ‌రో రాష్ట్రానికి మార్చే ఏర్పాట్లు చేస్తాం.. మరో వేదికకు మ్యాచ్ ను మార్చాలి’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపిన‌ట్టు ఏఎన్‌ఐ నివేదించింది.

Latest Videos

INDVSAFG: భారత్ తో టీ20 సిరీస్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ కు బిగ్ షాక్..

కాగా, గత నెలలో దుబాయ్‌లో జరిగిన IPL 2024 వేలం ముగిసిన తర్వాత జట్లు ఇప్పటికే తమ త‌మ జ‌ట్ల‌ను ఐపీఎల్ కోసం సిద్ధం చేస్తున్నాయి. ఇక వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడి రికార్డును రెండుసార్లు బ్రేక్ చేసింది. ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ స్టార్క్ కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లతో కోనుగోలు చేసి టోర్నీ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా చేసింది. అలాగే, ఐపీఎల్ వేలం కూడా వ్యూయ‌ర్ షిప్ లో రికార్డు సృష్టించింది. ఐపీఎల్ 2024 వేలం మునుపటి వేలం వీక్షకుల కంటే 57 శాతం పెరిగింది. IPL వేలం మొత్తం 22.8 మిలియన్ల మంది వీక్షకులను ఆకర్షించిందనీ, 2022 వేలంలో జరిగిన వేలం కంటే ఎక్కువ అని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సెక్రటరీ జైషా తెలిపారు. 

T20 World Cup 2024: రోహిత్, కోహ్లీల రాక‌తో భారత్‌కు మరో ప్రపంచకప్‌ ఖాయమా?

click me!