IND vs ENG: భారత్ ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్ లో ఎన్ని పరుగులు చేసిందంటే..?

By Mahesh RajamoniFirst Published Feb 16, 2024, 2:00 PM IST
Highlights

India vs England: భార‌త్-ఇంగ్లాడ్ మూడో టెస్టులో రోహిత్ శ‌ర్మ‌, ర‌వీంద్ర జ‌డేజాలు సెంచ‌రీలు కొట్టారు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ హాఫ్ సెంచ‌రీ సాధించాడు. 
 

India vs England: రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాడ్ మూడో టెస్టులో ఆట‌గాళ్లు బ్యాట్ తో రాణించ‌డంతో భార‌త్ భారీ స్కోర్ సాధించింది. రోహిత్ శ‌ర్మ, ర‌వీంద్ర జడేజాల సెంచ‌రీలు కొట్టారు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో హాఫ్ సెంచ‌రీ  సాధించాడు. తొలి ఇన్నింగ్స్ చివ‌ర‌లో ధృవ్ జురెల్ 46 ప‌రుగులు, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 37 ప‌రుగులు చేయ‌డంతో భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో 445 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది.

భార‌త ఆట‌గాళ్ల‌లో రోహిత్ శ‌ర్మ 131 ప‌రుగులు, ర‌వీంద్ర జ‌డేజా 112 ప‌రుగులు కొట్టారు. అలాగే, అరంగేట్రం ఆట‌గాళ్లు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 62 ప‌రుగులు, ధృవ్ జురెల్ 46, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 37 ప‌రుగులు, జ‌స్ప్రీత్ బుమ్రా 26 ప‌రుగులు చేశారు. దీంతో భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో 445 (10 wkts, 130.5 Ov) ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో మార్క్ వుడ్ 4 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, రెహాన్ అహ్మ‌ద్ 2 వికెట్లు, జేమ్స్ అండ‌ర్స‌న్,జో రూట్, టామ్ హార్ట్లీ లు త‌లా ఒక వికెట్ తీసుకున్నారు. 

Latest Videos

IND vs ENG: సెంచ‌రీ కోసం సర్ఫరాజ్ ఖాన్ ను బ‌లి చేశావా జ‌డ్డూ భాయ్.. ! రోహిత్ శ‌ర్మ కోపం చూశారా..?

 

Innings Break!

A solid batting performance from to post 4⃣4⃣5⃣ on the board! 💪 💪

Scorecard ▶️ https://t.co/FM0hVG5pje | pic.twitter.com/jNltRFg5FN

— BCCI (@BCCI)

IND VS ENG: 146 KMPH బౌన్స‌ర్.. సిక్సు కొట్టిన ప్లేయ‌ర్.. ధృవ్ జురెల్ తో పెట్టుకుంటే అంతే మ‌రి.. !

భార‌త్ తొలి ఇన్నింగ్స్ వికెట్ల పతనం:

22-1 ( యశస్వి జైస్వాల్ , 3.5), 24-2 (శుభ్ మ‌న్ గిల్ , 5.4), 33-3 ( రజత్ పటీదార్ , 8.5), 237-4 ( రోహిత్  శ‌ర్మ‌, 63.3), 314-5 ( సర్ఫరాజ్ ఖాన్ , 81.5), 331. -6 ( కుల్దీప్ యాదవ్ , 89.4), 331-7 ( రవీంద్ర జడేజా , 90.5), 408-8 (ర‌విచంద్ర‌న్ అశ్విన్ , 119.6), 415-9 ( ధ్రువ్ జురెల్ , 123.5), 445-10 ( బుమ్రా , 130).

హార్దిక్ పాండ్యాకు ఝ‌ల‌క్.. టీ20 ప్రపంచకప్‍-2024 లో భార‌త కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ !

click me!