India vs England 3rd Test: అరంగేట్రం మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ భయంలేకుండా ఆడిన తీరు అందరి దృష్టిని ఆకర్షంచింది. అయితే, తొలి టెస్టు మ్యాచ్ లోనే రనౌట్ కావడంపై భారత దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే స్పందిస్తూ బాధపడ్డారు.
Anil Kumble was very upset with Sarfaraz Khan's run-out: రాజ్‌కోట్ వేదికగా జరిగిన భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేశాడు. ఈ టెస్టు ఇన్నింగ్స్‌లోనే సెంచరీ సాధించేలా కనిపించాడు. 26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఆటతో అరదగొట్టాడు. తొలి టెస్టు మ్యాచ్ లోనే వన్డే స్టైల్‌లో ఫిఫ్టీ సాధించాడు. అతని దూకుడు చూస్తూ ఇంకా పరుగుల వరద పారించేలా కనపించాడు. ఇలాంటి తరుణంలో అభిమానులందరి గుండెల్లో మంటలు రేపుతూ అనూహ్యంగా సర్ఫరాజ్ రనౌట్ అయ్యాడు. బాగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రనౌట్ అయినందుకు క్రికెట్ లవర్స్ ను తీవ్రంగా బాధించింది. సర్ఫరాజ్ ఖాన్ ఆకస్మిక నిష్క్రమణపై భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే చాలా బాధపడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
అనిల్ కుంబ్లే తన దురదృష్టాన్ని సర్ఫారాజ్ కు అందించానా అని బాధపడ్డారు. ఎందుకంటే.. రాజ్‌కోట్ టెస్ట్‌కు ముందు సర్ఫరాజ్ ఖాన్‌కు తన తొలి టెస్ట్ క్యాప్‌ను అందించింది ఆల్ టైమ్ గ్రేట్ స్పిన్నర్లలో ఒకరైన అనిల్ కుంబ్లే. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందిన కుంబ్లే చేతుల మీదుకు భారత క్యాప్ ను అందుకున్న సర్ఫరాజ్ ఖాన్‌కు దురదృష్టం ఎదురైంది. అనిల్ కుంబ్లే మాదిరిగానే సర్ఫరాజ్ తన అరంగేట్రం టెస్టులో రనౌట్‌తో వెనుదిరిగాడు. పరుగు కోసం భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కాల్ విని క్రీజు వీడిన సర్ఫరాజ్ ను మార్క్ వుడ్ రనౌట్ చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 66 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ తో 62 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో సర్ఫరాజ్ ఖాన్ కు టెస్టు క్యాప్ అందించిన అనిల్ కుంబ్లే చాలా బాధపడ్డారు.
undefined
IND VS ENG: నిజంగా అదే నా తప్పే.. సర్ఫరాజ్ ఖాన్ కు సారీ చెప్పిన జడేజా.. చేసిందంతా చేసి.. !
90 పరుగుల వద్ద రవీంద్ర జడేజా తడబడగా, సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీకి చేరువైన క్రమంలో జడేజా ఒత్తిడికి గురై సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ కు కారణం అయ్యాడు. అనిల్ కుంబ్లే స్పందిస్తూ.. "నా అరంగేట్రం టెస్టులో నేను ఎదుర్కొన్న రనౌట్ డిజాస్టర్‌ను టోపీతో పాటు సర్ఫరాజ్ ఖాన్ కు అప్పగించి ఉండవచ్చు' అని అనిల్ కుంబ్లే జియో సినిమాలో ఉద్వేగభరితంగా చెప్పాడు. అనిల్ కుంబ్లే 1990లో మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 2 పరుగులకే రనౌట్ అయ్యాడు. తాను టెస్టు క్యాప్ అందించిన సర్ఫరాజ్ కూడా రనౌట్ కావడం తనను తీవ్రంగా బాధిస్తోందని తెలిపాడు.
కాగా, రాజ్‌కోట్‌లో సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టు ఇన్నింగ్స్ అని ఎప్పుడూ అనిపించలేదు. దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ హిట్టింగ్ తో అదరగొట్టాడు. అదే తరహాలో తొలి టెస్టు అనే భయం లేకుండా అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో సర్ఫరాజ్ చాలా సునాయాసంగా ఆడాడు. పేసర్ మార్క్ వుడ్‌ని పరీక్షిస్తూ కనిపించాడు. కానీ స్పిన్నర్లపై పైచేయి సాధించడం విశేషం. ఏదేమైనా తన అరంగేట్రం టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ చాలా మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేశాడని అనిల్ కుంబ్లే కొనియాడారు.
IND vs ENG: సెంచరీ కోసం సర్ఫరాజ్ ఖాన్ ను బలి చేశావా జడ్డూ భాయ్.. ! రోహిత్ శర్మ కోపం చూశారా..?