ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ షురూ.. భారత్ మళ్లీ ట్రోఫీ సాధిస్తుందా? టీమ్, షెడ్యూల్ ఇదే..

By Mahesh RajamoniFirst Published Jan 19, 2024, 10:21 AM IST
Highlights

ICC Under-19 World Cup 2024: ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2024 జనవరి 19 నుంచి ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ బ‌రిలోకి దిగుతుండ‌గా, జనవరి 20న బంగ్లాదేశ్ తో తన తొలి మ్యాచ్  ఆడ‌నుంది. టీమిండియాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. 
 

ICC Under-19 World Cup 2024-India: ఐసీసీ పురుషుల అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2024  గురువారం (జనవరి 19) నుంచి ప్రారంభం కానుంది. 24 రోజుల్లో 16 దేశాలు 41 మ్యాచ్ లు ఆడనున్నాయి. డ‌ర్బ‌న్ లో షురూ కానున్న అండ‌ర్ 19 క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ 2024 తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో అమెరికా త‌ల‌ప‌డ‌నుంది. దక్షిణాఫ్రికాలో జరగనున్న అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్ గత నెలలో విడుదలైంది. తొలుత శ్రీలంకలో నిర్వహించాలని భావించినప్పటికీ ఐసీసీ క్రమశిక్షణా చర్యల కారణంగా చివరి నిమిషంలో దక్షిణాఫ్రికాకు మార్చారు. గ్రూప్-ఎలో ఐర్లాండ్, అమెరికా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2024 బ‌రిలో మొత్తం 16 జ‌ట్లు

అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2024లో మొత్తం 16 జట్లు బ‌రిలో నిలిచాయి. శుక్ర‌వారం నుంచి ఫిబ్రవరి 11 వరకు అండర్-19 ప్రపంచకప్ పోటీలు జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ బ‌రిలోకి దిగుతుండ‌గా, జనవరి 20న బంగ్లాదేశ్ తో తన తొలి మ్యాచ్  ఆడ‌నుంది. టీమిండియాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. గ్రూప్-ఏ లో భారత్ తో పాటు బంగ్లాదేశ్, ఐర్లాండ్, బంగ్లాదేశ్, అమెరికా ఉన్నాయి. మ్యాచ్ లను 4 గ్రూపులుగా విభజించి ఒక్కో జట్టు మరో జట్టుతో ఒకసారి ఆడుతుంది.

మ‌రో సంచలనం.. ఒకేసారి నలుగురు ప్రపంచ ఛాంపియన్ క్రికెట‌ర్ల రిటైర్మెంట్.. !

లీగ్ మ్యాచ్ ల త‌ర్వాత సూప‌ర్ సిక్సు మ్యాచ్ లు..

నాలుగు గ్రూపుల నుంచి మూడు జట్లు సూపర్ 6 దశకు అర్హత సాధిస్తాయి. సూపర్ 6 దశ తర్వాత సెమీఫైనల్, ఫైనల్ జరుగుతాయి. సెమీఫైనల్స్ ఫిబ్రవరి 6, 8 తేదీల్లో, ఫైనల్ ఫిబ్రవరి 11న జరుగుతాయి. ఆ మూడు మ్యాచ్ లకు రిజర్వ్ డే ఉంటుందని ఐసీసీ ప్రకటించింది. జనవరి 20న బంగ్లాదేశ్ తో భారత జట్టు తలపడనుంది.

జనవరి 25న ఐర్లాండ్ తో, 28న యూఎస్ఏతో భార‌త్ తలపడనుంది. మొత్తం 41 మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందుకోసం ఐదు మైదానాలను సిద్ధం చేశారు. భారత జట్టు ఇప్పటివరకు ఐదు సార్లు అండర్-19 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. 2000, 2008, 2012, 2018, 2022 విజయం సాధించింది. గత ఏడాది ప్రపంచ కప్ లో యశ్ ధూల్ సారథ్యంలోని భారత అండర్-19 జట్టు విజయం సాధించింది. దీంతో భారత జట్టుపై అంచనాలు పెరిగాయి.

విరాట్ జంపింగ్.. బుమ్రా బౌలింగ్ ! మ్యాచ్‌ని మలుపు తిప్పిన కింగ్ కోహ్లీ.. !

ఈ ఏడాది భారత జట్టుకు ఉదయ్ సహారన్ సారథ్యం వహించనున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో భారత్ అండర్-19 ఆటగాడు అవనీష్ ను చెన్నై సూర్ కింగ్స్ కొనుగోలు చేసింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనే దానిపై సీఎస్కే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. 

భారత అండ‌ర్-19 జ‌ట్టు: అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), అరవెల్లి అవనీష్ రావు, సౌమీ కుమార్ పాండే, మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్, ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, రాజ్ లింబాని నమన్ తివారీ.

మ్యాచ్‌లు జరిగే వేదిక‌లు ఇవే.. 

దక్షిణాఫ్రికా ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండగా, పోట్‌చెఫ్‌స్ట్‌రూమ్, బ్లూమ్‌ఫోంటైన్, బెనోని, కింబర్లీ, ఈస్ట్ లండన్‌లలో మ్యాచ్ లు జరగనున్నాయి. సెమీ-ఫైనల్, ఫైనల్ అన్నీ బెనోనిలో జరుగుతాయి.

భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ కు వేదిక‌వుతున్న 'న్యూయార్క్ నాసావు కౌంటీ స్టేడియం' ఇదే.. ఫొటోలు ఇవిగో.. !

మొత్తం నాలుగు గ్రూపులు

గ్రూప్ ఏ: భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, యూఎస్ఏ
గ్రూప్ బీ: ఇంగ్లాండ్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్
గ్రూప్ సీ: ఆస్ట్రేలియా, నమీబియా, శ్రీలంక, జింబాబ్వే
గ్రూప్ డీ: ఆఫ్ఘ‌నిస్తాన్, నేపాల్, న్యూజిలాండ్, పాకిస్తాన్

టీమిండియా అండర్-19 మ్యాచ్ లు ఎప్పుడు? 

జనవరి 20- బంగ్లాదేశ్ vs భారత్
జనవరి 25- భార‌త్ vs ఐర్లాండ్
జనవరి 28- భారత్ vs యూఎస్ఏ

విరాట్ కోహ్లీ కౌగిలితో జైలుకు.. బ‌య‌ట‌కువ‌చ్చిన అభిమానికి ఘనస్వాగతం.. వైర‌ల్ వీడియో !

click me!