విరాట్ జంపింగ్.. బుమ్రా బౌలింగ్ ! మ్యాచ్‌ని మలుపు తిప్పిన కింగ్ కోహ్లీ.. !

By Mahesh Rajamoni  |  First Published Jan 19, 2024, 8:47 AM IST

Virat Kohli: అఫ్గానిస్థాన్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా రెండు సూపర్ ఓవర్ల ఆడి థ్రిల్లింగ్ విక్ట‌రీ సాధించింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సూప‌ర్ సెంచ‌రీ ఇన్నింగ్స్ ఆడ‌గా, కింగ్ విరాట్ కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండానే భార‌త్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. లేకపోతే సూపర్ ఓవర్ వ‌ర‌కు వెళ్తేదే కాదు.. !
 


Virat Kohli-Jasprit Bumrah: బెంగళూరు వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20లో మ‌రోసారి క్రికెట్ మ్యాచ్ ఏ క్ష‌ణంలో ఎలాంటి మ‌లుపునైనా తీసుకుంటుంద‌ని నిరూపించింది. భార‌త్ చేసిన 212 ప‌రుగుల‌ను ఆఫ్ఘ‌నిస్తాన్ స‌మం చేయ‌డంతో సూప‌ర్ ఓవ‌ర్ కు దారితీసింది. ఒకటి కాదు రెండు సూపర్ ఓవర్ల తర్వాత మ్యాచ్ ఫలితం వచ్చింది. భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. అయితే,  వీఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సూప‌ర్ సెంచ‌రీ ఇన్నింగ్స్ తో ఆడ‌గా, కింగ్ విరాట్ కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండానే భార‌త్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. లేకపోతే సూపర్ ఓవర్ వ‌ర‌కు వెళ్తేదే కాదు.. !

రోహిత్ శర్మ (69 బంతుల్లో 121 పరుగులు, 11 ఫోర్లు, 8 సిక్సర్లు), రింకు సింగ్ (39 బంతుల్లో 69; 2 ఫోర్లు, 6 సిక్సర్లు)లు భార‌త్ భారీ స్కోర్ అందించారు. రెండు సూపర్ ఓవర్ ల‌లో వీరోచిత ప్రదర్శనతో అఫ్గానిస్థాన్ ను చిత్తుచేసి 3-0తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది భార‌త్. అయితే, ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ బ్యాటింగ్ లో రాణించ‌లేక‌పోయినా.. అద్భుత‌మైన ఫీల్డింగ్ తో అద‌ర‌గొట్టాడు. టీమిండియా గెలుపులో కీల‌కపాత్ర పోషించాడు. సూపర్ మ్యాన్ లా విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ దగ్గర ఆ ఒక్క సిక్సర్ ను ఆపకపోయి ఉంటే మ్యాచ్ సూపర్ ఓవర్ వచ్చేది కాదు ! మరో అద్భుతమైన క్యాచ్ కూడా పట్టాడు.. !

Latest Videos

అప్ప‌టికే ఆఫ్ఘ‌నిస్తాన్ గెలుపున‌కు మెరుగైన అవ‌శాలు ఉన్నాయి. అఫ్గానిస్థాన్ కు విజయావకాశాలు ఎక్కువ‌గా ఉన్న త‌రుణంలో విరాట్ కోహ్లీ సూప‌ర్ ఫీల్డింగ్ తో ప‌రుగులు రాకుండా ఆపాడు. 17వ ఓవర్లో అఫ్గానిస్థాన్ విజయానికి 20 బంతుల్లో 48 పరుగులు అవసరమయ్యాయి. బ్యాట్స్ మన్ కరీం జనత్ వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని బలంగా కొట్టాడు. బంతి గాల్లోకి ఎగిరి బౌండరీ లైన్ దాటి ఎగిరింది. అయితే బౌండరీ లైన్ దగ్గర నిల్చున్న కోహ్లీ ఓపికగా బంతిని గమనించి బంతి వచ్చే సమయానికి పైకి దూకి సిక్సర్ ప‌డాల్సిన బంతిని ఆపాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఐదు పరుగులు కాపాడాడు. ఒక సిక్సర్ ఉంటే ఆప్ఘనిస్థాన్ సునాయాసంగా గెలిచేది.

ఒక్క‌సారిగా సిక్స‌ర్ కు వెళ్లేలా వ‌చ్చిన ఆ బంతిని విరాట్ కోహ్లీ సూప‌ర్ మ్యాన్ లా గాల్లోకి ఎగిరి క్యాచ్ ప‌ట్టే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే, బౌండ‌రీలైన్ దాడి ప‌డే అవ‌కాశం ఉండ‌టంతో దానిని సిక్స‌ర్ ప‌డ‌కుండా ఆపి ఒక్క‌ప‌రుగు మాత్ర‌మే వ‌చ్చేలా చేశాడు. కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్ ను అభిమానులు మెచ్చుకుంటున్నారు. అలాగే, బంతిని పట్టుకోవడంలో కోహ్లీ శైలి జస్ప్రీత్ బుమ్రా తరహాలో ఉండ‌టంతో.. వీరిద్ద‌రి ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. బుమ్రా బౌలింగ్, విరాట్ జంపింగ్ అంటూ వీరిద్ద‌రిని ఒకే ఫ్రేమ్ లో ఉంచిన ఫొటో వైర‌ల్ అవుతోంది. విరాట్ కోహ్లీ అద్భుత‌మైన ఫీల్డింగ్, బుమ్రా బౌలింగ్.. ఈ రెండింటినీ ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫొటోను ఐసీసీ కూడా షోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసింది. పర్ఫెక్ట్ ఫోటో అంటూ.. ఇది చూసి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ.. చేర్ చేయ‌డంతో పాటు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 

The perfect mirror image does not exi....😮 pic.twitter.com/AXFvgA4R6j

— ICC (@ICC)

 

భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ కు వేదిక‌వుతున్న 'న్యూయార్క్ నాసావు కౌంటీ స్టేడియం' ఇదే.. ఫొటోలు ఇవిగో.. !

click me!