అరేయ్ ఏంట్రా ఇది.. ఇలా చేస్తున్నారు.. ! మీకేమైంది..

By Mahesh RajamoniFirst Published Apr 1, 2024, 10:29 PM IST
Highlights

BAN vs SL : బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో రెండవ మ్యాచ్ చిట్టగాంగ్‌లో జరుగుతోంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 531 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్‌ 178 ప‌రుగుల‌కు తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయింది.
 

Bangladesh Cricketers Viral Video : బంగ్లాదేశ్ vs శ్రీలంక టెస్టు సిరీస్ లో ఆట‌గాళ్ల  చిత్ర‌విచిత్రాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. మ‌రోసారి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ప్లేయ‌ర్లు చేసిన ఒక ప‌ని వీడియో దృశ్యాలు వైర‌ల్ గా మారాయి. అరేయ్ ఎంట్రా ఇది ఇలా చేస్తున్నారు.. ఇదేమీ ఆట అంటూ  సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి. బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో రెండవ మ్యాచ్ చిట్టగాంగ్‌లో జరుగుతోంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 531 పరుగులు చేయ‌గా, బంగ్లాదేశ్ 178 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగుల ఆధిక్యం సాధించిన శ్రీలంక‌.. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేయ‌డంతో మొత్తం ఆధిక్యం 455 పరుగులకు చేరుకుంది.

బంగ్లా ప్లేయ‌ర్లపై సోషల్ మీడియాలో పెలుతున్న‌ జోకులు..

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్‌పై జోకులు పెలుతున్నాయి. బంగ్లా ఫీల్డింగ్ కు సంబంధించిన దృశ్యాలు వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే శ్రీలంక బ్యాట‌ర్ ఇచ్చిన ఒక క్యాచ్ ను ముగ్గురు బంగ్లా ప్లేయ‌ర్లు ఒకేసారి జార‌ విడిచారు. ఇప్పుడు బౌండ‌రీకి వెళ్తున్న బంతిని ఆపేందుకు ఏకంగా ఐదుగురు బంగ్లా ఫీల్డ‌ర్లు ప‌రుగుపెట్టారు. అంద‌రినీ ఆశ్చ‌ర్చానికి గురిచేస్తున్న ఈ వీడియో దృశ్యాలు వైర‌ల్ గా మారాయి. దీంతో మ‌రోసారి ట్రోల‌ర్స్ బంగ్లా ప్లేయ‌ర్ల‌పై మీమ్స్ తో రెచ్చిపోతున్నారు.

రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రభాత్ జయసూర్య థర్డ్ మ్యాన్ వైపు షాట్ ఆడాడు. దాన్ని పట్టుకోవడానికి బంగ్లాదేశ్‌కు చెందిన  ఒక్క ప్లేయ‌ర్ కాదు ఏకంగా ఐదుగురు ఫీల్డర్లు పరుగులు తీశారు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరేయ్ ఏం ఆట డుతున్నారు..? ఏంట్రా ఇది మీకేమైంది ఇలా చేస్తున్నారు అంటూ ట్రోల‌ర్స్ బంగ్లా ప్లేయ‌ర్ల పై విరుచుకుప‌డుతున్నారు.

ధోని షాక్.. చిరుతాల కదిలి పక్షిలా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో సూపర్ క్యాచ్

 

R̶e̶a̶l̶ ̶l̶i̶f̶e̶ ̶i̶n̶c̶i̶d̶e̶n̶t̶ ̶i̶n̶s̶p̶i̶r̶i̶n̶g̶ ̶a̶ ̶m̶o̶v̶i̶e̶

Movie inspiring a real-life incident 🎥
.
. pic.twitter.com/1USI5EH9cV

— FanCode (@FanCode)

మ్యాచ్ రెండో రోజు కూడా ఇలాంటి ఒక తమాషా ఘ‌టన కనిపించింది. రెండో రోజు 121వ ఓవర్ సమయంలో శ్రీలంక స్కోరు 419/6 కాగా, అదే సమయంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు సులువైన క్యాచ్ అందుకోలేకపోయారు. ఖలీద్ అహ్మద్ వేసిన బంతిని ప్రభాత్ జయసూర్య  డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ బంతి బ్యాట్ అంచుని తీసుకొని స్లిప్‌లోకి వెళ్లింది. మొదటి స్లిప్ వద్ద నిలబడిన కెప్టెన్ నజ్ముల్ శాంటో ఈ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు, ఆ తర్వాత బంతి అతని చేతికి తాకడంతో రెండవ స్లిప్‌లో షహదత్ హుస్సేన్‌కి వెళ్లి, అతను కూడా క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. థర్డ్ స్లిప్‌లో నిలబడిన జకీర్ హసన్ బంతి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చినా అందుకోలేక‌పోయాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

A juggling act with the ball. 👀
.
. pic.twitter.com/zV4JbhGc8u

— FanCode (@FanCode)

టీ20 క్రికెట్ లో ధోని స‌రికొత్త రికార్డు.. ఒకేఒక్క ప్లేయ‌ర్ గా ఘ‌న‌త‌ 

click me!