PM Modi With Team India: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీ గెలిచిన తర్వాత గురువారం టీమిండియా స్వదేశానికి చేరుకుంది. యావత్ భారతావనిని అద్భుతమైన సంబరాల్లో ముంచింది. ఢిల్లీకి చేరుకున్న తర్వాత టీమిండియా ప్రధాని నరేంద్ర మోడీ తో ప్రత్యేక సమావేశమైంది.
PM Modi With Team India: ఐసీసీ క్రికెట్ చరిత్రలో ఒక్క ఓటమి ఏరుగకుండా టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను గెలుచుకుని టీమిండియా చరిత్ర సృష్టించింది. ఫైనల్లో సౌతాఫ్రికాను 7 పరుగులు తేడాతో ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. ఐసీసీ ట్రోఫీతో భారత జట్టు జూలై 4న స్వదేశానికి తిరిగి వచ్చింది. ఢిల్లీలో దిగిన వెంటనే టీమిండియాకు ఘనంగా స్వాగతం లభించింది. ఢిల్లీలో దిగిన తర్వాత అభిమానులతో కలిసి సంబరాలు చేసుకుంది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేక సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ భారత ప్లేయర్లతో ముచ్చటించారు. టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించారు.
ఈ సమావేశంలో ప్రధాని మోడీ ఛాంపియన్ జట్టును అభినందించడమే కాకుండా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఫైనల్ కు సంబంధించి కొన్ని ప్రత్యేక విషయాలను ప్రధాని మోడీతో పంచుకున్నారు.
undefined
రోహిత్ శర్మను ప్రధాని ఏమడిగారు?
ప్రపంచ కప్ ఫైనల్ విజయం తర్వాత హిట్‌మ్యాన్ పిచ్ లోని మట్టిని తీసుకుని రుచి చూస్తున్న క్షణాలను గురించి ప్రధాని మోడీ కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశ్నించారు. 'మ్యాచ్ గెలిచిన పిచ్ ను ఎందుకు రుచి చూశారో చెప్పండి' అని ప్రధాని అన్నారు. ఈ ప్రశ్నకు రోహిత్ సమాధానమిస్తూ.. ''చాలా ఏళ్ల తర్వాత ట్రోఫీని గెలుచుకున్నాం. ఈ క్షణాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలనుకున్నాను. మేమంతా దీని కోసం చాలా ఎదురుచూశాం, చాలా కష్టపడ్డాం. చాలా సార్లు వరల్డ్ కప్ గెలవడానికి చాలా దగ్గరగా వచ్చాము, కానీ మరింత ముందుకు సాగలేకపోయాము, కానీ ఈసారి అందరి సహకారం వల్లే మేం చేయగలిగామని'' తెలిపారు.
విరాట్ కోహ్లీతో..
ఈ సమావేశంలో టీ20 ప్రపంచ కప్ గెలిచన తర్వాత విరాట్ కోహ్లీ ఆనంద క్షణాలు, ఎలా ఫీల్ అయ్యారని ప్రధాని అడిగారు. కింగ్ కోహ్లీ మాట్లాడుతూ.. "ఈ రోజులు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ప్రపంచకప్‌లో జట్టు కోరుకున్న సహకారం అందించలేకపోయాను.. కానీ కొన్నిసార్లు మనం ఏమీ చేయలేము.. కొన్నిసార్లు మనం బాగా చేస్తాం. మ్యాచ్ చూస్తుంటే గెలిచిన తీరు అంత ఈజీ కాదు. ఇది ఒక అద్భుత ప్రయాణం" అని విరాట్ అన్నారు.
టీమిండియా.. విరాట్ కోహ్లీ గూస్‌బంప్స్ తెప్పించారు ! వీడియో