Team India : టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన టీమిండియాకు ఘనంగా స్వాగతం లభించింది. ముంబైలో టీమిండియా వీక్టరీ పరేడ్ తర్వాత వాంఖడే స్టేడియంలో విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా ప్లేయర్లు యావత్ భారతావనికి గూస్‌బంప్స్ తెప్పించారు.
India's victory parade : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుని బార్బడోస్ నుంచి తిరిగి వచ్చిన భారత జట్టుకు ఘనస్వాగతం లభించింది. ఐసీసీ ట్రోఫీతో టీమిండియా స్వదేశానికి రావడంతో రోజంతా దేశంలో సంబరాల వాతావరణం కనిపించింది. భారత జట్టు ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని బీసీసీఐ టీ20 ప్రపంచ కప్ విజేత టీమిండియా విజయ పరేడ్‌ను ఏర్పాటు చేసింది. ముంబై వీధుల్లో టీమిండియా విక్టరీ పరేడ్ ఘనంగా జరిగింది. అనంతరం వాంఖడే స్టేడియంలో పెద్ద సంఖ్యలో అభిమానుల మధ్య విజయోత్సవ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఛాంపియన్ భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల ప్రైజ్ మనీని అందజేసింది.
వాంఖడేలోని 33 వేల మందికి పైగా అభిమానుల సమక్షంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టును బీసీసీఐ సన్మానించింది. ఈ సందర్భంగా బాలీవుడ్ సింగర్ ఏఆర్ రెహమాన్ దేశభక్తి గీతం వందేమాతరం సాంగ్ తో పాటు చక్ దే ఇండియా సాంగ్ స్టేడియంలో ఉద్వేగ క్షణాలను అందించింది. 'మా తుజే సలాం.. వందేమాతరం' అంటూ భారత ఆటగాళ్లు గొంత్తెత్తి పాడటంతో వారితో గొంతు కలిపి స్టేడయం మొత్తం హోరెత్తించారు అభిమానులు. 'వందేమాతరం..' అంటూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా మొత్తం భారత ఆటగాళ్లు స్టేడియంలో టీమిండియా విజయాన్ని జరుపుకున్నారు. ఈ అద్భుతమైన క్షణాలు అందరినీ భావోద్వేగానికి గురిచేశాయి. గూస్ బంప్స్ తెప్పించాయి. ఇప్పుడు బీసీసీఐ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఇది చూసిన ప్రతిఒక్క భారతీయుడిని భావోద్వేగానికి గురిచేస్తోంది.
undefined
वंदे मातरम 🇮🇳 pic.twitter.com/j5D4nMMdF9
— BCCI (@BCCI)
కాగా, దాదాపు 17 ఏళ్ల తర్వాత భారత జట్టు రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా దక్షిణాఫ్రికాపై ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని ఛాంపియన్ గా నిలిచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. టార్గెట్ ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేయగలిగింది. ఈ విజయంతో భారత్ తన 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసింది. అంతకుముందు, 2013లో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
AN UNFORGETTABLE DAY 💙
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆 | | pic.twitter.com/FeT7VNV5lB
హ్యాట్సాఫ్.. హార్దిక్ పాండ్యాపై రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్.. ఎమన్నాడంటే?