Champions Trophy: అప్పుడు సచిన్, ద్రవిడ్‌, ధోని.. ఇప్పుడు రికార్డులు బద్దలు కొట్టనున్న విరాట్ కోహ్లీ

Published : Feb 28, 2025, 08:35 PM IST
Champions Trophy: అప్పుడు సచిన్, ద్రవిడ్‌, ధోని.. ఇప్పుడు రికార్డులు బద్దలు కొట్టనున్న విరాట్ కోహ్లీ

సారాంశం

Champions Trophy: భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన చివరి గ్రూప్ మ్యాచ్ ను న్యూజిలాండ్‌తో మార్చి 2న దుబాయ్‌లో ఆడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగించడానికి సిద్ధంగా ఉన్నాడు. 

ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు తన తర్వాతి మ్యాచ్ ను న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ మార్చి 2న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. రెండు జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌లో చోటు దక్కించుకున్నాయి. భారత జట్టు వారం రోజుల లాంగ్ బ్రేక్ తర్వాత మ్యాచ్ ఆడనుంది. న్యూజిలాండ్ బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో గెలిచి భారత్ టాప్ ప్లేస్‌ను ఫిక్స్ చేసుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పై అందరి కళ్లు ఉంటాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అనేక రికార్డులు బద్దలు కొట్టనున్నాడు.

దుబాయ్ లో న్యూజిలాండ్ పై రికార్డుల మోత మోగించనున్న విరాట్ కోహ్లీ 

విరాట్ కోహ్లీ దుబాయ్ లో జరిగే భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆడితే కొత్త రికార్డు సాధిస్తాడు. లెజెండరీ ప్లేయర్ల ఎలైట్ క్లబ్ లో చేరతాడు. ఎందుకంటే ఆ మ్యాచ్ విరాట్ కోహ్లీకి 300వ వన్డే మ్యాచ్ అవుతుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ 2025లో పాకిస్థాన్‌పై అద్భుతమైన సెంచరీ భారత్ కు విజయాన్ని అందించాడు. ఇప్పుడు కివీస్ పై కూడా భారీ ఇన్నింగ్స్ ను ఆడాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు.

దుబాయ్‌లో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. 100 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి వన్డే కెరీర్‌లో 51వ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో పాటు అతని బ్యాట్ నుంచి మరో పెద్ద రికార్డు నమోదైంది. విరాట్ పాకిస్థాన్‌పై ఈ సెంచరీ ఇన్నింగ్స్ తో వన్డేల్లో వేగంగా 14000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. ఈ విషయంలో సచిన్ టెండూల్కర్‌ రికార్డును బద్దలుకొట్టాడు. ఇప్పుడు అతని కళ్లు 300వ వన్డేలో పెద్ద ఇన్నింగ్స్ ఆడటంపై ఉంది.

భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ లో గ్రౌండ్ లోకి అడుగుపెడితే లెజెండరీల సరసన  చేరనున్న కోహ్లీ

 భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ గ్రౌండ్ లోకి దిగగానే సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని సహా పలువురు లెజెండరీలతో కూడి ఎలైట్ గ్రూప్ లో కోహ్లీ చేరిపోతాడు. భారత్ తరఫున 300 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలుస్తాడు. ఇండియా తరఫున అత్యధిక వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన బ్యాట్స్‌మెన్ లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్. ఈ ఫార్మాట్‌లో అతని పేరు మీద మొత్తం 463 మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ తర్వాత భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఉన్నాడు. అతను 347 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. మహి తర్వాత రాహుల్ ద్రవిడ్ 340 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు. 

భారతదేశం తరపున అత్యధిక వన్డే క్రికెట్ మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్ళు 

  1. సచిన్ టెండూల్కర్ - 463
  2. మహేంద్ర సింగ్ ధోని – 347
  3. రాహుల్ ద్రవిడ్ -340
  4. మొహమ్మద్ అజారుద్దీన్ -334
  5. సౌరవ్ గంగూలీ -308
  6. యువరాజ్ సింగ్ -301
  7. విరాట్ కోహ్లీ -299

ఇవి కూడా చదవండి: 

Most Expensive Player: కోహ్లీ కాదు రోహిత్ కాదు.. ఒక్క పరుగుకు 3 లక్షలు తీసుకున్న క్రికెటర్ ఎవరంటే?

Champions Trophy: ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ వ‌ర్షంతో ర‌ద్దైతే సెమీస్ చేరేది ఎవ‌రు?

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?