IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి ఇంగ్లాండ్ లెజెండ్.. ఛాంపియన్ గా నిలబెడతాడా?

Published : Feb 27, 2025, 11:11 PM IST
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి ఇంగ్లాండ్ లెజెండ్..  ఛాంపియన్ గా నిలబెడతాడా?

సారాంశం

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ కోసం ఇంగ్లాండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్‌ను తమ జట్టుతో కొనసాగుతారని డీసీ ప్రకటించింది.

IPL 2025: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఇంగ్లాండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్‌ను తమ జట్టు మెంటార్‌గా నియమించినట్లు ప్రకటించింది. 44 ఏళ్ల పీటర్సన్ క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల్ రావు, హెడ్ కోచ్ హేమాంగ్ బదాని, అసిస్టెంట్ కోచ్ మాథ్యూ మోట్, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్‌తో కలిసి పనిచేస్తారని ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఛైర్మన్ & కో-ఓనర్ కిరణ్ కుమార్ గ్రాంధి మాట్లాడుతూ, "కేపీని మా జట్టు మెంటార్‌గా ఆహ్వానించడానికి మేం సంతోషిస్తున్నాం. అతను గతంలో ఐపీఎల్‌లో మా జట్టుకు ఆడాడు. అతను వేరే రోల్ లో తిరిగి జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అతనికున్న అనుభవం, ఆటపై అతనికున్న అవగాహన, ఫ్రాంచైజీ పట్ల అతనికున్న అభిమానం మా జట్టుకు, ఆటగాళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని మేం నమ్ముతున్నాం" అని అన్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ తో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి: కెవిన్ పీటర్సన్

ల్లీ క్యాపిటల్స్ కో-ఓనర్ పార్థ్ జిందాల్ మాట్లాడుతూ, "కేపీ ఆధునిక బ్యాటర్లలో ఒకడు. అతను మా జట్టులో ఉండటం చాలా విలువైనది. అతను తన జ్ఞానాన్ని, అనుభవాన్ని ఉపయోగించి మా ఆటగాళ్లకు సహాయం చేస్తాడని ఆశిస్తున్నాం. అతను ఈ కొత్త పాత్రలో రాణించాలని కోరుకుంటున్నాను.. మాకు ఆ నమ్మకముంది" అని అన్నారు. దశాబ్దం తర్వాత ఢిల్లీ ఫ్రాంచైజీకి తిరిగి వచ్చిన పీటర్సన్ మాట్లాడుతూ, "ఐపీఎల్‌లో ఢిల్లీ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించినందుకు నాకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. నేను సంవత్సరాలుగా బ్రాడ్‌కాస్టర్‌గా ఉన్నప్పటికీ జట్టు పట్ల నాకున్న అభిమానాన్ని కొనసాగించాను. నేను 2012 సీజన్‌లో వేణుతో (వేణుగోపాల్ రావు) కలిసి ఆడాను. ఈ అద్భుతమైన ఫ్రాంచైజీలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని అన్నారు.

 "డీసీ ఓనర్లు, ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ ఆలోచన వచ్చినప్పుడు వెంటనే అంగీకరించాను. క్యాపిటల్స్‌కు మెంటార్‌గా ఈ కొత్త పాత్రలోకి అడుగు పెట్టడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. జట్టుతో కలిసి పనిచేయడానికి, ఐపీఎల్ టైటిల్ ను గెలవడానికి నేను చేయగలిగినదంతా చేయడానికి ఎదురు చూస్తున్నాను" అని ఆయన అన్నారు.

టీ20 క్రికెట్ లో కెవిన్ పీటర్సన్ రికార్డులు ఏంటి?  

200 టీ20ల్లో 5,695 పరుగులు చేసిన పీటర్సన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, పూణే ఫ్రాంచైజీలతో కలిసి 36 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 1001 పరుగులు చేశాడు. 2008-2009 మధ్య ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పీటర్సన్ 2010 ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో తన అద్భుతమైన ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఇది ఇంగ్లాండ్ తమ తొలి ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడానికి సహాయపడింది. ఇక అంతర్జాతీయ కెరీర్‌లో పీటర్సన్ 104 టెస్టులు ఆడి 8,181 పరుగులు, 136 వన్డేలు ఆడి 4,440 పరుగులు చేశాడు.

కాగా, ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రఖ్యాత కోచ్ మాథ్యూ మోట్‌ను తమ అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. మోట్ 2022 ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ పురుషుల జట్టును విజయపథంలో నడిపించాడు. అంతకుముందు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఏడు సంవత్సరాలు గడిపాడు. అతని పదవీకాలంలో రెండు టీ20 ప్రపంచ కప్ టైటిల్స్, ఒక వన్డే ప్రపంచ కప్, నాలుగు యాషెస్ సిరీస్ విజయాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

Virat Kohli.. నేను చూసిన బెస్ట్ వన్డే ప్లేయర్ : రికీ పాంటింగ్

క్రికెట్ అంపైర్ల జీతం: ఒక్కో మ్యాచ్‌కు ఎంత తీసుకుంటారో తెలుసా?

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Cricket: టెస్టుల్లో 300, వన్డేల్లో 200, ఐపీఎల్‌లో 100.. ఎవరీ మొనగాడు?
IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?