ఆసీస్ పై తొలి వన్డేలో చేదు అనుభవం: కోహ్లీ సేనకు మరో భారీ షాక్

By telugu team  |  First Published Jan 15, 2020, 6:36 PM IST

వికెట్ కీపర్ రిషబ్ పంత్ రాజ్ కోట్ కు టీమిండియా జట్టు సభ్యులతో వెళ్లడం లేదని బీసీసీఐ చెప్పింది. ఆస్ట్రేలియాతో జరిగే రెండో వన్డేలో రిషబ్ పంత్ ఆడుతాడా, లేదా అనే క్లారిటీ లేదు.


ముంబై: ఆస్ట్రేలియాపై ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డే మ్యాచులో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండో వన్డేలో ఆడే ఆవకాశం లేదు. ఇప్పటికే తొలి వన్డేలో ఓడిపోయి తల బొప్పి కట్టిన కోహ్లీ సేనకు ఇది మరో దెబ్బ. 

తొలి వన్డేలో గాయపడిన రిషబ్ పంత్ జట్టుతో పాటు రాజ్ కోట్ కు వెళ్లడం లేదని బీసీసీఐ ప్రకటించింది. తొలి వన్డే మ్యాచులో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్యాట్ కమ్మిన్స్ వేసిన 44వ ఓవరులో ఓ బంతి పంత్ హెల్మెట్ కు బలంగా తాకింది. 

Latest Videos

undefined

Also Read: గాయంతో రిషబ్ పంత్ ఫట్: కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్

కమ్మిన్స్ వేసిన బంతితో గాయపడిన పంత్ రెండో ఇన్నింగ్సులో మైదానంలోకి దిగలేదు. పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేశాడు. మనీష్ పాండే ఫీల్డింగ్ కు వచ్చాడు.

"మిగతా జట్టుతో పాటు రిషబ్ పంత్ నేడు రాజ్ కోట్ కు వెళ్లడం లేదు. అతను ఆ తర్వాత జట్టుతో కలుస్తాడు. గాయంతో బాధపడుతున్నవారిని కనీసం 24 గంటల పాటు పర్యవేక్షించాలి" బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పారు. 

Also Read:ముంబై వన్డే: పరమ చెత్తగా కోహ్లీ సేన ఓటమి, ఓపెనర్లే ఫినిష్ చేశారు

దాంతో రిషబ్ పంత్ రెండో వన్డేలో ఆడుతాడా, లేదా అనే సందేహం కలుగుతోంది. అతనికి ఇంకొంత కాలం విశ్రాంతి ఇస్తారా అనేది తేలాల్సిందే. తొలి వన్డేలో పంత్ 33 బంతులు ఆడి 29 పరుగులు చేశాడు. భారత్ తమ ముందు ఉంచిన 256 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఛేదించింది.

ఆస్ట్రేలియాతో రెండో వన్డే మ్యాచ్ రాజ్ కోట్ లో ఈ నెల 17వ తేదీన జరగనుంది. మూడో వన్డే జనవరి 19వ తేదీన బెంగుళూరులో జరుగుతుంది.

Also Read: లోయర్ మిడిల్ ఆర్డర్ లో కోహ్లీ బ్యాచ్ చెత్త ప్రయోగాలు

Also Read: సిక్స్ కొట్టిన విరాట్ కోహ్లీకి ఆడమ్ జంపా రిటర్న్ గిఫ్ట్.

click me!