IND W vs UAE W Highlights : ఆదివారం రంగిరి దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మహిళల ఆసియా కప్ 2024 లో భారత్ 78 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ తో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది.
IND W vs UAE W Highlights: మహిళల ఆసియా కప్ 2024 లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన భారత జట్టు తన రెండో మ్యాచ్ లో యూఏఈపై గెలిచి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం శ్రీలంకలోని రంగిరి దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 78 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా రెండో విజయం.
ఈ విజయంతో టీమిండియా చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డును అందుకుంది. మహిళా క్రికెట్ జట్టు చరిత్రలో తొలిసారిగా 200 పరుగులు చేసిన జట్టుగా భారత్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 201 పరుగులకు ఆలౌటైంది. భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన యూఏఈ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది.
పవర్‌ప్లేలో భారత్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ ఐదో వికెట్‌కు 45 బంతుల్లో 75 పరుగులు జోడించి భారత్ స్కోరును 20 ఓవర్లలో 201/5కి తీసుకెళ్లారు. భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్రలో ఏ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ స్కోరు 200 దాటలేదు. కానీ, ఇప్పుడు భారత్ దానిని అందుకుంది. మహిళల టీ20 క్రికెట్ లో 200 పరుగులు చేసిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. అంతకుముందు, 2018లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో భారత్ అత్యుత్తమ స్కోరు 198/4 పరుగులు.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు షఫాలీ వర్మ (37 పరుగులు), హర్మన్‌ప్రీత్ కౌర్ (66 పరుగులు), రిచా ఘోష్ (64 పరుగులు) బ్యాట్ తో రాణించి జట్టు స్కోర్ బోర్డును 201 పరుగులకు చేర్చారు. భారీ టార్గెట్ ఛేదనలో యూఏఈ కేవలం 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఏఈ బ్యాటర్లలో కెప్టెన్ ఈషా రోహిత్ ఓజా 38 పరుగులు, కవిషా ఎగోడాగే 40 పరుగులతో రాణంచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీసుకున్నారు. గ్రూప్ ఏ లో భారత జట్టు వరుసగా రెండు విజయాలతో ప్రస్తుతం 4 పాయింట్లతో టాప్ లో ఉంది.
ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక మెడల్స్ గెలిచిన టాప్-5 అథ్లెట్లు