W W W W W.. ఈ సారి బాల్ తో విధ్వంసం సృష్టించిన మార్నస్ లబుషేన్

By Mahesh RajamoniFirst Published Jul 20, 2024, 10:25 PM IST
Highlights

marnus labuschagne : ఆస్ట్రేలియా  స్టార్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన మార్న‌స్ ల‌బుషేన్ ఈ సారి బ్యాట్ తో కాకుండా బాల్ తో అద్భుతం చేశాడు. ఒకటి రెండు కాదు.. ఐదు వికెట్లు తీసుకుని సంచ‌ల‌నం సృష్టించాడు.
 

marnus labuschagne : ప్రపంచంలోని టాప్ ర్యాంక్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ టీ20 మ్యాచ్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఎప్పుడు బ్యాట్ తో మెరిసే ఈ ప్లేయ‌ర్ ఈ సారి బాల్ తో ర‌ఫ్పాడించాడు. అద్భుత‌మైన బౌలింగ్ తో వ‌రుస‌గా వికెట్లు తీసుకుని అద‌ర‌గొట్టాడు. ఒక‌టికాదు రెండుకాదు ఏకంగా ఐదు వికెట్లు తీసుకుని అంద‌రినీ అశ్చ‌ర్య‌ప‌రిచాడు ఈ స్టార్ బ్యాట‌ర్. అత‌నే ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ మార్న‌స్ ల‌బుషేన్.  బ్యాట్ తో కాకుండా ఈ సారి బాల్ తో అత‌ని ప్ర‌ద‌ర్శ‌న చూసి స్టేడియంలో కూర్చున్న అభిమానులు సైతం అశ్చ‌ర్య‌పోయారు. ఇది సోమర్‌సెట్, గ్లామోర్గాన్ మధ్య జ‌రిగిన టీ20 మ్యాచ్ లో జ‌రిగింది.

బ్యాటింగ్‌లో మంచి గుర్తింపు ఉన్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మార్నస్ లబుషేన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్నాడు. సూప‌ర్ బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టే ఈ ప్లేయ‌ర్ గ్లామోర్గాన్ త‌ర‌ఫున సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవ‌లం 11 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్లు తీసుకుని సంచ‌ల‌నం సృష్టించాడు. అతని ప్రమాదకరమైన బౌలింగ్‌ను చూసి స్టేడియంలో ఉన్న అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బ్యాట్ తోనే కాకుండా బాల్ తో కూడా ఈ స్టార్ అద్భుతాలు చేస్తాడా .. ! అని అశ్చ‌ర్య‌పోయారు. కేవ‌లం 2.3 ఓవర్ల బౌలింగ్‌లోనే ల‌బుషేన్ 5 వికెట్లు తీసుకున్నాడు. 

Latest Videos

మార్న‌స్ ల‌బుషేన్ సూప‌ర్ బౌలింగ్ తో సోమర్‌సెట్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో గ్లామోర్గాన్ 120 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లామోర్గాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు చేసింది. సోమర్సెట్ జట్టు 123 పరుగులకే కుప్పకూలింది. గ్లామోర్గాన్‌కు చెందిన కీరన్ కార్ల్సన్ పేలుడు బ్యాటింగ్ తో 64 బంతుల్లో 135 పరుగుల సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడాడు. త‌న ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు.

 

Marnus Labuschagne finished with figures of 5-11 against Somerset 🤯

These are the best bowling figures recorded by a Glamorgan player in the Vitality Blast! pic.twitter.com/vUDtm60ScQ

— Vitality Blast (@VitalityBlast)

 

కాగా, మార్నస్ లాబుషేన్ అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్‌లో కాకుండా బ్యాటింగ్‌లో మంచి గుర్తింపు సాధించాడు. ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్న ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ టెస్టు ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్నాడు. అతను 50 టెస్ట్ మ్యాచ్‌లలో 11 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలతో 4114 పరుగులు చేశాడు. 52 వన్డేల్లో 1656 పరుగులు చేశాడు. 

భార‌త్ లో అత్యంత ఖ‌రీదైన టాప్-5 ఇళ్ళు ఎవ‌రివో తెలుసా?

click me!