Gautam Gambhir : శ్రీలంకతో వైట్ బాల్ సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతున్న క్రమంలో జట్టు ఎంపికపై గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. టీమిండియా ప్రధాన కోచ్ గా గంభీర్ కు ఇది తొలి షెడ్యూల్.
Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు ఈ నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన జూలై 27 నుంచి ప్రారంభం కానుంది. తొలుత భారత్-శ్రీలంక మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. తర్వాత వన్డే సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలోనే బీసీసీఐ రెండు సిరీస్ లకు స్క్వాడ్ ను ప్రకటించింది. ఇందులో రెండు ఫార్మాట్ లకు శుభ్ మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. ఇక వన్డే జట్టుకు ఛాంపియన్ ప్లేయర్ రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నారు.
టీమిండియా జట్టు ఎంపికపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జట్టు ఎంపికపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. అతని స్థానంలో గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టారు. అతని నాయకత్వంలో భారత జట్టుకు శ్రీలంక పర్యటన తొలి షెడ్యూల్. జట్టు ఎంపికపై కేవలం ఐపీఎల్ ప్రదర్శనలపై ఆధారపడకుండా, ఫార్మాట్‌లలో జట్టు ఎంపికకు దేశీయ ప్రదర్శనలే ప్రాథమిక ప్రమాణంగా ఉండాలనే గంభీర్ వైఖరిని వైరల్ అవుతున్న వీడియో హైలైట్ చేస్తుంది.
Gautam Gambhir's Old Video Goes Viral After Team India's Squad Selection For Sri Lanka Series - Watch pic.twitter.com/XTuKRIhkhU
— Akash Kharade (@cricaakash)
వైరల్ అవుతున్న ఈ పాత వీడియోలో గంభీర్ మాట్లాడుతూ.. కేవలం ఐపీఎల్ మాత్రమే కాకుండా దేశీయ టోర్నమెంట్లలో ప్రదర్శనల ఆధారంగా ఎంపికలు ఉండాలని నొక్కి చెప్పాడు. రవిచంద్రన్ అశ్విన్‌తో పోడ్‌కాస్ట్ సందర్భంగా.. "ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా టీ20 జట్టును ఎంపిక చేయాలి. 50 ఓవర్ల ఫార్మాట్ విజయ్ హజారే ట్రోఫీ ప్రదర్శనల నుండి ఎంపిక చేయాలి. ఇక టెస్ట్ జట్టు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ప్రదర్శనతో ఎంపిక చేయాలి" అని చెప్పారు.
1 ఓవర్.. 2 పరుగులు.. 3 వికెట్లు.. సూపర్ బౌలింగ్