వార్నీ ఏంది మామా ఇది.. ధోనితో పాటు మోడీ, అమిత్ షాలు కూడా ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు.. !

By Mahesh Rajamoni  |  First Published May 30, 2024, 7:31 PM IST

Team India Head Coach : త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌తో భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. ఈ క్ర‌మంలోనే తదుపరి కోచ్ కోసం బీసీసీఐ వేట మొద‌లుపెట్టింది. ఈ క్ర‌మంలోనే ఎంఎస్ ధోని తో పాటు న‌రేంద్ర మోడీ, అమిత్ షా ల‌తో పాటు చాలా మంది ప్ర‌ముఖుల పేర్లు టీమిండియా ప్ర‌ధాన కోచ్ ప‌దవి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారిలో ఉన్నాయి. 
 


Team India Head Coach : త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌తో భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. తదుపరి కోచ్ కోసం బీసీసీఐ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఈ క్ర‌మంలోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ప్లమ్మింగ్‌లతో కోచ్ పదవిపై చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ బీసీసీఐ సెక్రటరీ జై షా మాత్రం దీనిని ఖండించారు. ప్రధాన కోచ్ పదవికి సంబంధించి ఆస్ట్రేలియా నుండి ఎవరినీ సంప్రదించలేదని చెప్పారు. భారత దేశవాళీ క్రికెట్ నిర్మాణాలను క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్న‌ట్టు పేర్కొన్నారు.

కాగా, టీమిండియా ప్ర‌ధాన‌ కోచ్ ప‌దవి కోసం దరఖాస్తుల స్వీకరణకు గ‌డువు ముగిసింది. కోచ్ ప‌ద‌వి కోసం ఏకంగా 3000 వేల‌కు పైగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అయితే, ఇందులో షాకింగ్ కలిగించేలా చాలా మంది ప్ర‌ముఖుల పేర్లు ఉండ‌టం గ‌మ‌నాన‌ర్హం. ధోనీ, టెండూల్కర్, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా స‌హా ప‌లువురు ప్ర‌ముఖుల‌ పేర్లతో బీసీసీఐకి దాదాపు 3000 దరఖాస్తులు వచ్చాయి. మే 13న గూగుల్ ఫారమ్‌లలో కోచింగ్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇందులో చాలా మంది నకిలీ దరఖాస్తులు పంపుతున్నారు. మాజీ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, సెహ్వాగ్, హర్భజన్ సింగ్, టెండూల్కర్ పేర్ల నుంచే కాకుండా ప్రధాని మోడీ, అమిత్ షా వంటి రాజకీయ నేతల నుంచి కూడా దరఖాస్తులు అందాయి. దీంతో మాజీ క్రికెటర్లు అసలు దరఖాస్తులు పంపారా లేదా అన్నది తేల్చడం కష్టంగా మారిందని స‌మాచారం.

Latest Videos

undefined

ప్రియురాలిపై క‌త్తితో దాడి చేసి ప్రాణాలు తీసిన ప్రియుడు.. ఏలూరులో షాకింగ్ ఘటన, వీడియో

గతంలో కూడా ప్రధాన కోచ్ పదవికి బీసీసీఐకి దరఖాస్తులు వచ్చినప్పుడు 5000 దరఖాస్తులు రావడం గమనార్హం. గూగుల్ ఫారమ్‌లలో దరఖాస్తులు స్వీకరించడానికి కారణం ఒకే షీట్‌లో దరఖాస్తుదారుల పేర్లను తనిఖీ చేయడం సులభంగా ఉండ‌టంతోనే ఇలా వ‌స్తున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

అతిపెద్ద సవాలు అదే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కామెంట్స్ వైర‌ల్

click me!