MS Dhoni: డ్రెస్సింగ్ రూమ్ లో మన సహచరులు, సహాయక సిబ్బంది పట్ల మనం నడుచుకునే తీరు నాయకుడిగా అత్యంత ప్రధానమైనదని టీమిండిమా మాజీ సారథి ఎంఎస్ ధోని అన్నారు. మన ప్రవర్తనే మనకు గౌరవం తీసుకువస్తుందని తెలిపారు.
Chennai Super Kings - MS Dhoni: జట్టు నాయకుడిగా మిగతా ఆటగాళ్ల నమ్మకాన్ని పొందడం చాలా ముఖ్యమని భారత మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అన్నారు. మీరు ఆటగాళ్లకు విధేయుడిగా మారినప్పుడు, జట్టు ప్రదర్శన మెరుగ్గా ఉంటుందని చెప్పారు. నాయకుడిగా ప్లేయర్లను గౌరవించడం చాలా ముఖ్యమని చెప్పిన ధోని.. ఆటగాళ్లను అర్థం చేసుకుంటే తప్ప, వారి నమ్మకాన్ని పొందడం కష్టమని తెలిపారు.
భారత జట్టు ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఎంఎస్ ధోని ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. మనకు లభించే గౌరవం కుర్చీతో రాదనీ, మన ప్రవర్తన, నడవడికతో వస్తుందని చెప్పారు. "ఆటగాళ్లకు గౌరవం మీ దగ్గర నుంచి లభించాలి. గౌరవం పొందడానికి ప్రయత్నించవద్దు కానీ సంపాదించండి, ఎందుకంటే ఇది చాలా సహజమైనది. మీకు ఆ విధేయత ఉంటే, జట్టు ప్రదర్శన కూడా అలాగే ఉంటుంది. మీరు నడుచుకునే తీరే మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుందని" ఎంఎస్ ధోని అన్నారు.
undefined
VIRAT KOHLI: 13 ఏళ్ల కెరీర్‌లో ఇదే తొలిసారి.. విరాట్ కోహ్లీ కోరినందుకే ఇలా.. !
అలాగే, "నాయకుడిగా గౌరవం సంపాదించడం ముఖ్యమని నేను ఎప్పుడూ భావించాను, ఎందుకంటే అది కుర్చీ లేదా పదవితో రాదు. ఇది మీ చర్యతో వస్తుంది. మీ ప్రవర్తనతో వస్తుంది. కొన్నిసార్లు, జట్టు మిమ్మల్ని విశ్వసించినప్పటికీ, మీపై నమ్మకం లేని మొదటి వ్యక్తి మీరే అయ్యే అవకాశముంటుంది" అని ధోని పేర్కొన్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రతి ఆటగాడి బలాలు-బలహీనతలను అర్థం చేసుకోవడం ముఖ్యమనీ, పలువురు ఆటగాళ్లు ఒత్తిడిని ఇష్టపడతారు.. మరికొంత మంది దీనికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో మీరు నడుచుకునే తీరు ఫలవంతంగా ఉండాలని ధోని చెప్పారు.
కాగా, ఎంఎస్ ధోని భారత దిగ్గజ ప్లేయర్లలో ఒకరు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోని.. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టకు నాయకత్వం వహిస్తున్నారు. భారత్ తరఫున ధోనీ 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 4,876 పరుగులు చేయగా, వన్డేలలో 10,773 పరుగులు సాధించాడు. పొట్టి ఫార్మాట్ లో 1,617 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్న ధోని ఇప్పటి వరకు 190 మ్యాచ్‌లు ఆడిన 4,432 పరుగులు కొట్టాడు. టీమిండియాకు మూడు ఫార్మాట్ లలో ఐసీసీ టైటిల్స్ ను అందించిన ధోని.. ఐపీఎల్ లో తాను నాయకత్వం వహిస్తున్నా చెన్సై సూపర్ కింగ్స్ కు 5 సార్లు ఐపీఎల్ టైటిల్స్ ను అందించాడు.
రవీంద్ర జడేజా, అతని భార్య రివాబా పై తండ్రి షాకింగ్ కామెంట్స్..